సోషల్ మీడియాలో టాప్ హీరోల అభిమానుల మధ్య రగడ కొనసాగడం ఒక ట్రెండింగ్ గా మారింది. తమ హీరో గొప్పతనం కోసం మరో హీరోని నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేయడం ఒక అలవాటుగా మారింది. టాప్ హీరోల మధ్య సఖ్యత కొనసాగుతున్నప్పటికీ వారి అభిమానుల మధ్య మటుకు గ్యాప్ రోజురోజుకు పెరిగిపోతూ వార్ కొనసాగుతూనే ఉంది.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ రామ్ చరణ్ లు కలిసి నటించడంతో ఆమూవీలో తమ హీరో బాగా చేశాడు అంటే తమ అభిమాన హీరో మరింత గొప్పగా చేశాడు అంటూ టాప్ హీరో అభిమానుల మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల సమయంలో కొనసాగిన సోషల్ మీడియా కామెంట్స్ వార్ అప్పట్లో ట్రెండింగ్ గా మారిన విషయం తెలిసిందే. ఈవారం విడుదల కాబోతున్న ‘వార్ 2’ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈవారం ఆగష్టు 15ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘వార్-2’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన డ్యాన్స్ నంబర్ లో ఎవరు హైలైట్ అయ్యారు అనే విషయంలో జూనియర్ హృతిక్ రోషన్ వీరాభిమానుల మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ జరుగుతోంది. ఈ నెగిటివ్ కామెంట్స్ వార్ తారక్ దృష్టి వరకు రావడంతో తెలివిగా తారక్ ఈవిషయం పై తనదైన రీతిలో స్పందించాడు.

ఈ మూవీలోని పాటలో ఎవరు బాగా డాన్స్ చేశారు అన్న చర్చలు అనవసరం అనీ ఈపాట ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ కలిసి చేసిన సాంగ్ అని చెపుతూ దాన్ని ఎంజాయ్ చేయాలి కానీ తమ అభిమానులు ఒకరి పై ఒకరు నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోవడం మంచిది కాదు అంటూ తారక్ తెలివిగా చేసిన కామెంట్స్ ఈ నెగిటివ్ కామెంట్స్ యుద్ధాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుందో చూడాలి. ‘దేవర’ మూవీ తారక్ అభిమానులకు సరైన తృప్తిని ఇవ్వక పోవడంతో అభిమానుల ఆశలు అన్నీ ఈవారం విడుదలకాబోతున్న ‘వార్ 2’ పైనే ఉన్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: