
అసలు నాగ్ కి ఇచ్చిన రోల్ కంటే సౌబిన్ సాహిర్ చేసిన పాత్రకే ఎక్కువ స్కోప్ రావడం షాకింగ్ గా మారింది. సౌబిన్ ప్లే చేసిన క్యారెక్టర్‌కి లోకేష్ స్పెషల్ హోమ్‌వర్క్ చేసినట్టే స్క్రీన్ మీద కూడా కనపడింది. మొదట సైమన్ కు అనుచరుడిగా, తర్వాత అండర్ కవర్ పోలీస్ గా, మళ్ళీ బహుళ షేడ్స్ ఉన్న విలన్‌గా మారిపోతూ తన రేంజ్ చూపించాడు. అందుకే కూలీ రిలీజ్ అయిన తర్వాత నాగార్జున కంటే సౌబిన్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎన్నో ఆఫర్స్ వదులుకుని ఈ సినిమాకి ఓకే చెప్పిన సౌబిన్, ఇప్పుడు ఆ రిస్క్ ఫలించింది అనిపించుకున్నాడు. ఇకపై అతడికి ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం.ఇక నాగ్ విషయానికి వస్తే, ఫ్యాన్స్ నుంచి వస్తున్న కామెంట్ మాత్రం స్పష్టంగా ఉంది – “కుబేర, కూలీ” లాంటి సపోర్టింగ్ లేదా విలన్ రోల్స్ కన్నా మళ్లీ సోలో హీరోగానే ఎక్కువ సినిమాలు చేయమని.
గతంలో “సోగ్గాడే చిన్ని నాయన” లాంటి కమర్షియల్ మూవీ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో అందరికీ గుర్తుంది. అదే తరహాలో మాస్-ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలు చేస్తే, ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వస్తారని వాళ్లు నమ్ముతున్నారు. “వైల్డ్ డాగ్”, “ఘోస్ట్” లాంటి ప్రయోగాత్మక చిత్రాల కంటే పెద్ద బడ్జెట్ కమర్షియల్ మూవీస్ లో నాగ్ ని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వెంకటేష్ 300 కోట్ల బ్లాక్‌బస్టర్ కొట్టినట్టే, సరైన కంటెంట్ ఉంటే నాగ్ కూడా ఆ స్థాయిలో దుమ్ము దులిపేస్తాడని వారి నమ్మకం. ఇక బిగ్ బాస్ 9 హోస్టింగ్ కోసం నాగ్ రెడీ అవుతున్నాడు. కానీ ఆ తర్వాతి సినిమాల ఎంపికలో ఫ్యాన్స్ సజెషన్లు సీరియస్‌గా తీసుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక్క మంచి మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో నాగ్ కెరీర్ మళ్ళీ గాడిలో పడే ఛాన్స్ ఉందనే నమ్మకం మాత్రం అభిమానుల్లో ఉంది.