సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఒకసారి అంచనాలు మించి బాంబు పేలిపోతుంది. అదే ఇప్పుడు మహావతార్ నరసింహ. విడుదల రోజున ఎవ్వరూ పట్టించుకోని సినిమా, ఇప్పుడు నాలుగో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇది సాధారణ విషయం కాదు. స్టార్ హీరోల సినిమాలు రెండు వారాలు కూడా నిలబడటమే కష్టమవుతుంటే, ఈ యానిమేటెడ్ మూవీ మాత్రం కలెక్షన్లతో రెచ్చిపోతోంది. మొదట ఈ మూవీకి అసలు పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేశారు. ‘అనువాద సినిమా.. యానిమేషన్ మూవీ.. ఎవరు చూడబోతారు?’ అని ఫిల్మ్ నగర్‌లోనే చాలా మంది డౌట్ పెట్టుకున్నారు. కానీ కంటెంట్ సత్తా చూపింది. మౌత్ టాక్తో ఒక్కసారిగా ఫ్యామిలీ ఆడియన్స్, యువత అందరూ థియేటర్లకు పరుగెత్తారు. ఫలితంగా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ మెరుస్తున్నాయి.


ఈ వీకెండ్ బరిలోకి వచ్చిన రెండు భారీ సినిమాలు – వార్ 2 & కూలీ – ఒక్కటికి కూడా ఆశించిన ఫలితం రాలేదు. వార్ 2 డివైడ్ టాక్‌తో కిందకు దిగి పోయింది. కూలీ వసూళ్లు నిలకడగా ఉన్నా, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మహావతార్ నరసింహ వైపు వెళ్ళిపోయారు. దీంతో ఎగ్జిబిటర్లు షోలు మళ్లీ పెంచక తప్పలేదు. హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుండి రాత్రివరకు ఫాస్ట్ ఫిల్లింగ్ – సోల్డ్ ఔట్ ఉన్న స్టేటస్ మాత్రమే కనిపించింది. ఇక ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నదేంటంటే, ఈ మూవీ ఇప్పటివరకు రూ. 200 కోట్ల గ్రాస్ దాటేసింది. నాలుగో వారంలోనూ ఇంత దూకుడు అంటే రాబోయే రోజుల్లో రూ. 300 కోట్ల మార్క్ దాటడం ఖాయం అని గ్యారంటీ ఇస్తున్నారు. అంటే చిన్న సినిమా – యానిమేటెడ్ మూవీ – అనువాదం అయినప్పటికీ ఆల్ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.


ముఖ్యంగా పిల్లలు, ఫ్యామిలీస్ ఈ సినిమాను రెండో మూడో సారి కూడా చూస్తున్నారు. ఇది యానిమేషన్ ఇండస్ట్రీకి కొత్త దారులు తీసుకువస్తోందని అనిపిస్తోంది. ఇప్పటికే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ స్టార్ హీరోతో చేయాలని అనుకున్న ఫాంటసీ ప్రాజెక్ట్‌ను డ్రాప్ చేసి, పూర్తిగా యానిమేటెడ్ స్టైల్లో ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మహావతార్ నరసింహ ఇప్పుడు కేవలం సినిమా కాదు, కల్చరల్ ఫినామెనాన్ అయింది. స్టార్లున్నా లేకపోయినా, కంటెంట్ హిట్ అయితే ఎలా రెచ్చిపోతుందో ఈ మూవీ లైవ్ ఎగ్జాంపుల్. ఇంకా కనీసం రెండు వారాలు థియేటర్లలో దూసుకుపోతుందని ట్రేడ్ ఫ్రాటర్నిటీ అంచనా వేస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో, సర్ప్రైజ్ ప్యాకేజీ అంటే ఇక నుంచి ఒక్కటే పేరు – మహావతార్ నరసింహ !

మరింత సమాచారం తెలుసుకోండి: