సినీ హీరో నాగార్జున గ్లామర్ ఫిట్నెస్ చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.. ముఖ్యంగా నాగర్జున నటించిన చిత్రాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పవచ్చు. ఇటీవలే హీరో జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా. ఈ షోకి మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా నాగార్జున రావడం హైలైట్ గా నిలిచింది. ఇందులో సరదాగా వీరి మధ్య జరిగిన సంగతులను కెరియర్ ప్రారంభంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా సినిమా అవకాశం కోసం డైరెక్టర్ మణిరత్నం వెంటపడ్డాననే విషయాన్ని తెలియజేశారు నాగార్జున.


ప్రేక్షకులు నాగార్జున నటించిన మొదటి చిత్రం కేవలం తన తండ్రి నాగేశ్వరరావు గారి అబ్బాయి అని మాత్రమే చూశారని తెలిపారు నాగార్జున.మరి కొంతమందికి కూడా తాను నచ్చలేదని.. అందుకే ఆ తర్వాత ఆరేడు చిత్రాలలో నటించాను. ఈ క్రమంలోనే మజ్ను సినిమా కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. తనలో కూడా ఒక నటుడు ఉన్నారని ప్రేక్షకులు గుర్తించారు..కమర్షియల్ చిత్రాల విషయానికి వస్తే ఆఖరిపోరాటం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అది డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్లే సాధ్యమయిందని వెల్లడించారు.


ఈ చిత్రంలో తాను ఒక బొమ్మలాగా ఉన్నానంతే నాకు నచ్చింది చేయాలని ఫిక్స్ అయిపోయాను అందుకే మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చిన మౌనరాగం సినిమా తనకు బాగా నచ్చి.. ఆయన వాకింగ్కు వెళ్లే పార్కు వివరాలను మరి తెలుసుకొని నెలరోజుల పాటు ఆయన వెంట పడితే పది నిమిషాల పాటు  కలవగా అందులో టెన్నిస్ ఆడి పంపించారని.. చివరికి ఎలాగోలాగా ఒప్పించాను అదే గీతాంజలి సినిమా అని ఈ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కించారు అనుకున్నారు.. కానీ ఈ సినిమాని తెలుగులో తీసి మార్కెట్ పెంచుకోమని తానే సలహా ఇచ్చానని తెలిపారు నాగార్జున. అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుందని ఆయనకు క్రేజీ కూడా పెరిగిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: