ప్రస్తుతం ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు జాన్వి కపూర్ వైపు చూస్తోంది. ఇందుకు కారణం .. ఆమె ఇటీవలే కోట్లు విలువ చేసే ప్రాపర్టీ కొనుగోలు చేసిన వార్త బయటకు రావడం. జాన్వి కపూర్ మంచి టాలెంటెడ్ హీరోయిన్, శ్రీదేవి ముద్దుల కూతురు. డబ్బు పరంగా, బ్యాక్‌గ్రౌండ్ పరంగా ఆమెకు ఎలాంటి కొరత లేకపోయినా, చాలామంది ఆమెను “గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన బ్యూటీ” అని పిలుస్తుంటారు. కానీ అలాంటి జాన్వి కపూర్ ఇప్పుడు తన స్వంత కష్టంతో, సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు సమాచారం.


దాదాపు 5 కోట్లు ఖర్చు చేసి, ముంబైలోని ఒక బిజీ ఏరియాలో అపార్ట్మెంట్ కొన్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె కేవలం తన ప్రైవేట్ పార్టీల కోసం, వ్యక్తిగతంగా ఉండడానికి మాత్రమే కొనుగోలు చేసిందని అంటున్నారు. శ్రీదేవి ఇప్పటికే కోట్లాది ఆస్తిని సంపాదించి పెట్టారు. బోనీ కపూర్ కూడా సంపన్నుడే. అయినా, జాన్వి కపూర్ తన స్వంత డబ్బుతో, తన ఇష్టానుసారం ఒక ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటోందట. ఆ కారణంగానే ఆమె తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఈ విధంగా పెట్టుబడి పెట్టి, ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో, అభిమానుల  “జాన్వి కపూర్ టూ ఫాస్ట్” అంటూ పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పెళ్లి తర్వాతే చాలామంది ఇల్లు కొనాలని ఆలోచిస్తారు. కానీ జాన్వి కపూర్ పెళ్లికి ముందే ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పడం విశేషంగా మారింది. గతంలో శ్రీదేవి కూడా పెళ్లికి ముందే సొంత ఆస్తులు కూడబెట్టుకున్న సంగతి గుర్తుచేసుకుంటూ, అభిమానులు సోషల్ మీడియాలో జాన్వి నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి జాన్వీ ఏదో బిగ్ ప్లాన్ లో ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: