బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్యానర్ యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన స్పై యూనివర్స్‌లో తాజా ఎంట్రీగా వచ్చిన సినిమా వార్ 1. ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాపై కన్నేశారు. సినిమా రిలీజ్‌కి ముందే ట్రైలర్స్, మ్యూజిక్, హై బడ్జెట్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు విపరీతమైన హైప్‌ని తీసుకొచ్చాయి. ఫస్ట్ వీకెండ్‌లో ఆ హైప్ కలెక్షన్ల రూపంలో కూడా కనబడింది. ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. సోమవారం నుంచి కలెక్షన్ల వేగం తగ్గడం గమనార్హం. మేకర్స్ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.300.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.


అందులో ఇండియన్ మార్కెట్ నుంచి రూ.240 కోట్ల గ్రాస్ వచ్చింది. నెట్ వసూళ్ల విషయానికి వస్తే రూ.196.50 కోట్లను ఈ సినిమా సాధించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ మంచి స్పందన లభించింది. అక్కడి నుంచి రూ.60.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని నిర్మాతలు తెలిపారు. ‘వార్ 2’ వసూళ్లపై ఒక విధంగా ప్రభావం చూపిన సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’. అదే రోజున రిలీజ్ కావడంతో రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో భాగంగా కొంతమంది ‘కూలీ’ వైపు మొగ్గు చూపడం, టికెట్ రేట్లు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల ‘వార్ 2’ కలెక్షన్లు ఆశించినంత స్థాయిలో లేవు. అయినా తొలి వారం రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లో చేరడం మాత్రం ఈ సినిమాకు చాలా ప్ల‌స్ పాయింట్‌గానే చెప్పాలి.


సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా మెరిసింది. ఆమె గ్లామర్, యాక్షన్ ఎపిసోడ్‌లు, హృతిక్-ఎన్టీఆర్ మధ్య ఉన్న క్లాష్‌లు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉండటం తెలుగు ప్రేక్షకులకు న‌చ్చ‌లేదు. అందుకే తెలుగు గ‌డ్డ‌పై సినిమా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం లేదు. కొందరు అభిమానులు ఆయన నటనను మెచ్చుకున్నా, కొందరికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రతినాయకుడిగా చూడటం నచ్చలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: