అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా గత సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ అక్కడే మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో శ్రీ తేజ్ ను హైదరాబాదులో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అలా సుమారుగా నాలుగు నెలల పాటు ఆసుపత్రిలోనే ప్రత్యేకమైన వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్స అందించారు. అటు అల్లు అర్జున్, అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఇలా చాలామంది సెలబ్రిటీలు శ్రీతేజ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయాన్ని కూడా చేశారు.తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ వైద్య ఖర్చులు భరిస్తోంది.


శ్రీ తేజ్ కి మిషన్ వాత్సల్య :
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడడంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం శ్రీ తేజ్ కు అండగా నిలిచినట్లుగా తెలుస్తోంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆ బాదిత కుటుంబానికి భరోసా కల్పించేలా చేస్తోంది. ఈ పథకం కింద శ్రీతేజ్ కు ప్రతినెల రూ 4000 రూపాయలు చొప్పున ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది ఆ (బాలిక లేదా బాలుడు)18 సంవత్సరాలు నిండే వరకు అందిస్తుందట.

ఎవరెవరికి వర్తిస్తుందంటే:
శ్రీతేజ్ కు సుమారుగా మూడు నెలల క్రితమే ఈ పథకాన్ని కూడా ప్రారంభించారని ఇప్పటికి రూ .12,000 శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఖాతాలో కూడా తెలంగాణ ప్రభుత్వం జమ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై కూడా ప్రతి నెల రూ .4000 రూపాయలు శ్రీతేజ్ తండ్రి ఖాతాలో పడబోతున్నాయి. శ్రీ తేజ్ ట్రీట్మెంట్ ఇంకా జరుగుతూనే ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ సహాయంతోనే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంత బాగానే ఉందని వైద్యులకు తెలియజేస్తున్నారు. అనాధలు, ఇతరత్రా కారణాల చేత ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి పిల్లల కోసమే వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2021లో ఈ పథకాన్ని మొదలుపెట్టారు.. కేంద్రం 60 శాతం రాష్ట్రం 40% నిధులు అందిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: