
ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందన్న సమాచారం వస్తోంది. ఇందులో జయకృష్ణ పూర్తిగా మాస్ అటిట్యూడ్‌తో, పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడట. ఇదిలా ఉంటే, రమేష్ బాబు కుమార్తె భారతి కూడా హీరోయిన్‌గా అరంగేట్రం చేయబోతుంది. దర్శకుడు తేజ కుమారుడు హీరోగా రంగప్రవేశం చేయనున్న సినిమాలో భారతి హీరోయిన్‌గా ఎంపికైందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో కొంతమేర ట్రయల్ షూట్ కూడా జరిగిందని, ఫస్ట్ లుక్ రెడీ అయ్యాకే ఆఫిషియల్‌గా ప్రకటిస్తారంటున్నారు. అంతా సీక్రెట్‌గా జరిపిన ఈ ప్రాజెక్ట్‌కి త్వరలోనే బిగ్ ప్రొమోషన్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంతలోనే ఆయన మేనల్లుడు జయకృష్ణ హీరోగా వస్తుండగా, మేనకోడలు భారతి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్‌కి డబుల్ ఎగ్జైట్‌మెంట్ కలిగిస్తోంది. కృష్ణ కుటుంబం నుంచి హీరోయిన్ రాక చాలా ఏళ్ల క్రితమే చర్చలోకి వచ్చినా, ఆ ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి. ఇప్పుడు భారతి ఎంట్రీ ఖాయం కావడం, నిజంగానే ఘట్టమనేని ఫ్యామిలీకి కొత్త టర్న్ అని చెప్పాలి. అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ చేస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని సంప్రదించారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ మరింత హైప్ తెచ్చుకోవడం ఖాయం. మొత్తానికి – ఘట్టమనేని వారసత్వం మళ్లీ కొత్త పంథాలో ముందుకు సాగబోతోంది. ఒకవైపు కొత్త హీరో, మరోవైపు కొత్త హీరోయిన్ – ఈ రెండు ఎంట్రీలు టాలీవుడ్‌లో పెద్ద హంగామానే సృష్టించబోతున్నాయి.