
ఇప్పటికే ఈ షోకు వచ్చిన పలు ఎపిసోడ్‌లకు మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా నాగార్జున ఇంటర్వ్యూ ఎంత హైలైట్‌గా మారిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఆయన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటూ, జగపతిబాబు చాలా సరదాగా, ఫన్నీగా ఈ ఇంటర్వ్యూను ముందుకు నడిపించాడు. ఈ షోలో నాని రావాలని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. ఆయన వచ్చి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నాని చెప్పిన కొన్ని మాటలు ఇండస్ట్రీలో మంచి చర్చకు దారితీశాయి.
నాని మాట్లాడుతూ.."నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే, అప్పట్లోనే ఇంకో రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు వాటిని కాంపిటీషన్‌గా ఎందుకు చూస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏ సినిమా అయినా ఆ సినిమా అభిమానుల కోసం ఉంటుంది. ఆ సినిమాకి హడావిడి ఉండాలి. కానీ మా సినిమా ఆడాలి, ఇంకో సినిమా ఆడకూడదు అనడం సరైన విధానం కాదు. ఒక హీరో సినిమా ఆడితే, ఇంకో హీరో సినిమా ఆడకపోతే అది మంచి పద్ధతి కాదు. ఏ సినిమా ఆడకపోతే, మన సినిమా కూడా ఆడదు అని గుర్తుంచుకోవాలి. అందుకే నేను ఎప్పుడూ అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా రిలీజ్ సమయంలో కూడా నేను ఇంట్లో ప్రార్థిస్తాను. నా సినిమా రిలీజ్ రోజున మరో సినిమాలు ఉన్నా, అవి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అందరం బాగుండాలి, అందులో నేనూ ఉండాలి అనుకునే టైప్ నేను. మనమే బాగుండాలి అనుకుంటే, మనతో పాటు ఎవరికి మంచి జరగదు. దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అలా మనం కోరుకున్నప్పుడు ఆ ఆశీర్వాదం ఎప్పుడో మనకు వస్తుంది. అప్పుడే అందరూ హ్యాపీగా ఉంటారు." నాని ఇలా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినీ లవర్స్ కూడా స్పందిస్తూ,"నిజమే! ఇండస్ట్రీలో ఈ సాంప్రదాయం మారితేనే అందరూ బాగుపడతారు,"అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.