
ఇక డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా ఈ సినిమాకు బలమైన సపోర్ట్ లభిస్తోంది. తాజాగా నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్‌లో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో తెలిసిందే. ఈ డీల్ వెనక అనుష్కకు సన్నిహితుడైన హీరో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నట్టు టాక్ ? మైత్రీ ఎప్పుడు అయితే నైజాం రైట్స్ చేజిక్కించుందో ఒక్కసారిగా ఘాటీపై సీడెడ్, ఏపీ సర్కిల్స్‌లోనూ హైప్ మరింతగా పెరిగింది.
ఈ సినిమాలో మరో స్పెషాలిటీ విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించడం. ఆయన పాత్ర కథనానికి బలం చేకూర్చేలా ఉంటుందని సమాచారం. అలాగే సంగీత దర్శకుడు విద్యాసాగర్ నాగవెల్లి అందించిన మ్యూజిక్ ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా విద్యాసాగర్ మ్యూజిక్ సినిమాకు మరో రేంజ్ లిఫ్ట్ ఇవ్వబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అనుష్క శెట్టి కెరీర్‌లో చాలా సినిమాలు ఫీమేల్ ఓరియెంటెడ్ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అరుంధతి’, ‘భాగమతి’లాంటి చిత్రాలు ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు ‘ఘాటి’ కూడా అదే తరహాలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.