సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. కానీ మరి కొంత మంది కి మాత్రం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే అద్భుతమైన గుర్తింపు దక్కుతూ ఉంటుంది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అత్యంత తక్కువ సమయంలో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మణులలో రుక్మిణి వాసంతి ఒకరు. ఈమె కన్నడ సినిమా అయినటువంటి సప్త సాగరాలు దాటి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులకు బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి ఇటు తెలుగు , అటు తమిళ్ ఇండస్ట్రీ లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తమిళ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ హీరో గా రూపొందిన మదరాసి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో మదరాసి మూవీ యూనిట్ వరస పెట్టి అనేక ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. 

మూవీ యూనిట్ నిర్వహించిన ప్రతి ఈవెంట్ కు శివ కార్తికేయన్ మరియు రుక్మిణి వాసంతి దాదాపుగా అటెండ్ అవుతున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ అటెండ్ అయిన ప్రతి ఈవెంట్లో కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈమె ఏ ఈవెంట్ కు వెళ్ళినా కూడా ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా శివ కార్తికేయన్ ను కూడా ఈ బ్యూటీ డామినేట్ చేస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ.పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rv