తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ మాస్ దర్శకుడి గా గుర్తింపు ను సంపాదించుకున్న వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో దర్శకత్వం వహించిన చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే బోయపాటి ఎక్కువ శాతం తన కెరియర్లో బాలకృష్ణ తో సినిమాలు చేశాడు. బాలకృష్ణ , బోయపాటి కాంబో లో మొదటగా సింహ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత లెజెండ్ , అఖండ అనే సినిమాలు వచ్చాయి. ఈ మూడు మూవీలు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం బోయపాటి , బాలయ్య హీరోగా అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాను మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే బోయపాటి శ్రీను కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరో గా సరైనోడు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ , క్యాథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

అల్లు అరవింద్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు 2 సినిమాను రూపొందించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , అందుకోసం కసరత్తులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గీత ఆర్ట్స్ నుండి బోయపాటి శ్రీను ఒక సినిమాకు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దానితో మరి కొంత కాలం లోనే బోయపాటి శ్రీను "సరైనోడు 2" సినిమాకు సంబంధించిన పనులను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: