పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓజీ సినిమా విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఓజీ గ్లింప్స్ అభిమానుల్లో కాస్త నిరాశ కలిగించింది. ఈ గ్లింప్స్‌లో ఇమ్రాన్ హష్మి పాత్ర ఓమిని పరిచయం చేశారు.

అయితే, ఈ గ్లింప్స్ ఆహా.. అద్భుతం! అనిపించే స్థాయిలో లేదని కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గ్లింప్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు కొంతమేర తగ్గాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే కావడంతో, సినిమా ఎలా ఉండబోతోందనే పూర్తి క్లారిటీ రావాలంటే ట్రైలర్ కోసం వేచి చూడక తప్పదు.

కొంతమంది నెటిజన్లు మాత్రం మేకర్స్ కావాలనే ఇలా హైప్ తగ్గించారని భావిస్తున్నారు. భారీ అంచనాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని, సినిమా విడుదలయ్యాక మంచి అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి గ్లింప్స్ విడుదల చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, ఓజీ ట్రైలర్ విడుదలయ్యాక మాత్రమే సినిమాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాపై నెలకొన్న ఆసక్తి ట్రైలర్ విడుదల తర్వాత మరింత పెరుగుతుందో లేదో చూడాలి.

ఓజీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. పవన్ సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసిన సందర్భాలు అయితే లేవు. ఓజీ సినిమా సక్సెస్ సాధించడం పవన్ కెరీర్ కు కూడా కీలకమని చెప్పవచ్చు.  పవన్ భవిష్యత్తు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

og