గత కొంతకాలంగా హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా లావణ్య తనని వాడుకొని మోసం చేశాడు రాజ్ తరుణ్ అంటూ తన మీద ఇప్పటికే ఎన్నో కేసులు పెట్టింది.ఇప్పుడు తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పైన మరోసారి మూడు కేసులు నమోదు అయినట్లుగా తెలిసింది. కోకాపేటలో నివాసముంటున్న తనపైన దాడి చేశారంటూ లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేసింది. ఈ ఫిర్యాదులో రాజ్ తరుణ్ తో పాటుగా, రాజశేఖర్, అంకిత్ గౌడ్, మణికంఠ తంబాడి, రవితేజల పైన కూడా పోలీస్ కేసు నమోదు చేసింది లావణ్య.



అయితే ఈ ఫిర్యాదులో లావణ్య మూడు వేరువేరు సందర్భాలలో హీరో రాజు తరుణ్ ఆనుచరులు దాడి చేశారంటూ ఆమె ఆరోపణలు చేసింది. 2016లో తాను రాజ్ తరుణ్ తో కలిసి కోకాపేటలో ఒక ఇంటిని కొనుగోలు చేశానని వ్యక్తిగత విభేదాల వల్ల 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశారని వెల్లడించింది. అలా ఆ ఇంటిలో నివసిస్తున్న సమయంలోనే రాజు తరుణ్ అనుచరులు తనని విచక్షణ రహితంగా దాడి చేశారంటూ తెలిపింది. ముఖ్యంగా బెల్టులు, గాజు సీసాలతో కొట్టి తన దగ్గర దాచుకున్న బంగారు ఆభరణాలను కూడా అపహరించారని లావణ్య ఆరోపణలు చేసింది.


అలాగే ఇంటికి సంబంధించిన కేసు వ్యవహారం కోర్టులో పెండింగ్ ఉందని ఆ సమయంలోనే మరొక దాడి చేశారంటూ లావణ్య తెలిపింది. అలాగే తాను పెంచుకుంటున్న కుక్కలను కూడా చంపేశారని తండ్రి పైన కూడా దాడి చేసి గాయపరిచేలా చేశారంటూ లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఇందుకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేయగా దర్యాప్తును ప్రారంభించారు. లావణ్య ఇప్పటికే రాజు తరుణ్ మీద ఎన్నో రకాల ఆరోపణలు చేస్తూ ఉంది. దీనివల్ల రాజ్ తరుణ్ సినీ కెరియర్ కూడా ఇబ్బందులో పడేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: