
సినిమా బృందం ప్రత్యేకంగా కట్ చేస్తున్న ట్రైలర్ రష్‌ని చూసిన వాళ్లంతా బాగా ఇంప్రెస్ అవ్వడంతో, త్వరలోనే పబ్లిక్‌కి రిలీజ్ చేయాలని నిర్ణయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ వస్తే సినిమాపై హైప్ మరింత రెట్టింపు అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే టీజర్‌లో హారర్ టచ్, ప్రభాస్ లుక్ అన్నీ ఫ్యాన్స్‌ని అలరించాయి. ట్రైలర్‌తో కథ ఏ జానర్‌లో, ఎంత ఎమోషన్ కలగలిసిందో క్లియర్ అవుతుంది. మారుతీ ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ, కామెడీ సినిమాలు చేసినప్పటికీ, ఇప్పుడు హారర్ ఫాంటసీ అనే కొత్త జానర్‌ని టచ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్. మరోవైపు సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని సమాచారం.
బిగ్ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ, సంక్రాంతి పోటీలో భారీ స్థాయిలో రాణించబోతోందనే నమ్మకం యూనిట్‌లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇది డబుల్ ధమాకా టైమ్. ఒక వైపు సలార్ 2 అప్‌డేట్స్, మరోవైపు ది రాజా సాబ్ లేటెస్ట్ హైప్. మరి అక్టోబర్ మొదటి వారంలో ట్రైలర్ వచ్చేస్తే, సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా ఖాయం. మొత్తానికి “ది రాజా సాబ్” ట్రైలర్ టాక్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపేస్తోంది. అధికారిక అప్‌డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి కానీ, ఒకసారి రాగానే ఇది మాస్ ఫెస్టివల్‌లా మారిపోవడం ఖాయం!