అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈమె తన క్యూట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగులో మొదట గా నితిన్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అఆ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో కూడా ఈమె స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ , పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎంతో సాంప్రదాయ బద్దంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమా తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాల్లో స్కిన్ షో చేయకుండా పద్ధతి గల పాత్రలలో నటిస్తూ , మంచి డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా చాలా కాలం పాటు కెరియర్ను కొనసాగించిన ఈ ముద్దు గుమ్మ గత కొంత కాలంగా సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. ఈ బ్యూటీ మొదటగా రౌడీ బాయ్స్ అనే సినిమాలో లిప్ లాక్స్ సన్నివేశాల్లో పాల్గొంది. టిల్లు స్క్వేర్ మూవీ లో ఈమె మరింత అందాల ఆరబోత డోస్ ను పెంచింది. ఇక ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఏదైనా సినిమా ఈవెంట్లకు వెళ్లిన కూడా మాడ్రన్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళ్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో ఈ నటి రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉంది. చాలా కాలం తర్వాత అనుపమ అదిరిపోయే రేంజ్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీరకట్టులో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: