
ముఖ్యంగా నాని జడల్ అనే పాత్రలో కనిపించారు. చాలా రఫ్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాకి సంబంధించి హైదరాబాదులో 30 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ వేసి మరి సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయం పై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ మంచు లక్ష్మి ఒక ప్రెస్ మీట్ లో భాగంగా తన తండ్రి మోహన్ బాబు ది ప్యారడైజ్ లో కీలకమైన పాత్రలో నటిస్తున్నారంటూ తెలిపింది..
ఈ వయసులో కూడా తన తండ్రి అంతలా కష్టపడడం చూసి ఆశ్చర్యపోయానని.. తండ్రి ప్రతి సినిమాని తొలి సినిమా లాగా భావించి పాత్ర కోసం తన డెడికేషన్ చూపిస్తుంటారని చెప్పింది మంచి లక్ష్మి. మోహన్ బాబు తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో ఒక క్యామియో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అది కూడా ఒక స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలకమైన సన్నివేశంలో చిరంజీవిని చూపించేలా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేసినట్లు వినిపిస్తున్నాయి. అందుకోసమే చిరంజీవిని కూడా ఇటీవలే కలిశారట. అలాగే డైరెక్టర్ ఓదేల, చిరంజీవి కాంబినేషన్ లో కూడా సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది.