
దీనంతటికీ కారణం సందీప్ రెడ్డి వంగా. రాజమౌళి ఇమేజ్‌కు మించిన క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే, అది కచ్చితంగా సందీప్ రెడ్డే. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా, సృష్టించిన సెన్సేషన్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్, ఇక తర్వాత స్పిరిట్ – ఇవే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సందీప్ రెడ్డి వంగాకు లైఫ్ ఇచ్చింది అర్జున్ రెడ్డి సినిమా అని అంటారు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన లిప్‌లాక్ సీన్ సినిమాకి హైలైట్‌గా మారింది. దాంతో సందీప్ రెడ్డి పేరు మారుమ్రోగిగిపోయే స్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన యానిమల్లో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్‌ను ఒక వైలెంట్ పర్సన్‌గా మార్చి చూపించాడు.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ – ప్రభాస్ "స్పిరిట్" సినిమాలో ఆయనను సందీప్ రెడ్డి ఎంత వైలెంట్‌గా..? ఎంత నాటి యాంగిల్‌లో..?? చూపించబోతున్నాడు అనేది ఫ్యాన్స్‌లో పెద్ద ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. సందీప్ రెడ్డి ఈ ముగ్గురు హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తూ, వాళ్ల యాక్టింగ్ లెవెల్స్‌న్నీ దగ్గరగా గమనించాడు. అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు ప్రశ్నలు వేసుకుంటున్నారు – “ఇండస్ట్రీకి బెస్ట్ యాక్టర్ ఎవరు?” “సందీప్ రెడ్డి వంగా అభిప్రాయం ప్రకారం దున్నేస యాక్టర్ ఎవరు?” అని మాట్లాడుకుంటున్నారు.
అయితే సందీప్ రెడ్డి వంగా ఒక్క పేరు చెప్పడు. ఆయన ప్రతి హీరోలోని ప్రత్యేకతని బయటపెడతాడు. విజయ్ దేవరకొండలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించాడు, రణబీర్ కపూర్‌లోని యాక్షన్ సీన్స్‌ను, స్టార్‌కిడ్ ఇమేజ్‌ను కొత్తగా చూపించాడు. ఇక ప్రభాస్ కోసం స్పిరిట్ సినిమా విషయంలో ఆయన పడుతున్న కష్టాలు చూస్తుంటే, ఇప్పటివరకు ఎవరూ చూపని యాంగిల్‌లో ప్రభాస్‌ను చూపించబోతున్నాడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా అంటే – ఆయనకంటే మించిన రేంజ్‌లోనే అభిమానులు కూడా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. “ఎప్పుడెప్పుడు స్పిరిట్ సినిమా రిలీజ్ అవుతుందా?” అంటూ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు..??