పక్క వాళ్ళు ఎదుగుతూ ఉంటేనే చూసి తట్టుకోలేని సమాజంలో మనం బతుకుతున్నాం. అలాంటిది పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చి వాళ్లు అక్కడ సత్తా చాటుతూ ఉంటే ఊరుకుంటారా? అస్సలు కాదు. ఎలాగైనా సరే వాళ్లను తొక్కేయాలని, వాళ్లపై కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. ఇది కేవలం సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగమైనా సరే పక్కవాళ్లు ఎదుగుతూ ఉంటే కొందరు చూసి తట్టుకోలేరు. వాళ్లను ఎప్పుడెప్పుడు డౌన్ ఫాల్ చేస్తామా..? ఎప్పుడెప్పుడు కాళ్లని లాగేస్తామా..? అని కాచుకుని ఉంటారు. ఇలాంటి పరిస్థితిని చాలామంది ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది మరింత ఎక్కువైంది. పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఒక భాష ఇండస్ట్రీ హీరో మరో భాషలో సక్సెస్ అవుతూ, క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హీరోలు బాగా సత్తా చాటుతున్నారు. ఫలితంగా మిగతా భాషల ఇండస్ట్రీ స్టార్స్ డౌన్ ఫాలో అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.


ఇటీవల కాలంలో కోలీవుడ్ స్టార్స్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ ఇమేజ్‌తో ఇండస్ట్రీని షేక్  చేసిన హీరోలు ఇప్పుడు డమ్మీలుగా మారిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా తెలుగు హీరోలు హై పొజిషన్ సంపాదించి, పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ పాపులారిటీ పెంచుకోవడం, తెలుగు ప్రజలు దాన్ని హైలైట్ చేయడం కోలీవుడ్ అభిమానులకు బాగా మండిపోయేలా చేసింది. దీంతో కోలీవుడ్ వర్గాల వారు కూడా తెలుగు హీరోలపై మండిపడుతున్నారు.

 

“తెలుగు హీరోల సినిమాలకు వచ్చే క్రేజ్‌కు అసలు కారణం డైరెక్టర్లే, హీరోలు పెద్దగా ఏమి చేయలేదు” అంటూ ఘాటు కౌంటర్స్ వేస్తున్నారు. అంతేకాదు, ఇటీవలి కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పెద్ద గొడవ జరిగిన విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ, “ఇక్కడ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోరు, పబ్లిసిటీ ఎలాగో వస్తూనే ఉంటుంది” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలే టాలీవుడ్‌లో ఆ హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటే, ఇప్పుడు కోలీవుడ్ జనాలు కూడా వాళ్ల మధ్య మంటలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇదేం పైశాచిక ఆనందం బాబోయ్! తెలుగు హీరోలు హిట్ కొడితే ఈ విధంగా ద్వేషం తీర్చుకుంటారా?” అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: