సాధారణంగా ఎవరైన స్టార్స్ ని తిట్టినా లేక ట్రోల్ చేసినా ఒక చిన్న సమస్యకు కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతారు. వాళ్లు ఒక మాట చెప్పగానే, వెంటనే మీడియా ముందుకు వచ్చి, కన్నీళ్లు పెట్టి, సాపనార్ధాలు చెప్పి, తమను తాము గొప్ప అని మాట్లాడుకునేలా చేస్తారు. కానీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్ ..తన గురించి ఇంటర్నేష్నల్ లెవల్ లో రచ్చ జరుగుతున్న ఏ విధమైన రియాక్షన్ చూపకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవరో కాదు దీపికా పదుకొనే .
 

 “కల్కి 2” సినిమా నుంచి ఆమెను తక్షణం తీసేయడం పెద్ద తలనొప్పిగా మారింది . ఆస్ధానంలో వేరే హీరోయిన్స్ ఉంటే  మీడియా ముందు ఏడుస్తూ,  అల్లకల్లోలంగా స్పందిస్తారు. కానీ దీపికా పదుకొనే మాత్రం అలా ఏమీ చేయలేదు. ఆమె సింపుల్‌గా, తను చేయగల పనిని సక్రమంగా కొనసాగిస్తూ, ముందుకు నడిచింది. దీంతో అందరు ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎందుకు “కల్కి 2” మూవీ నుంచి తీసేసిన సైలెంట్ గా ఉంది అనేది ఇప్పుడు జనాల ప్రశ్న..?



ఈ విషయంపై ఆమె స్పందించకపోవడం, ప్రజల్లో రకరకాల ఊహలు, చర్చలను రేకెత్తించింది. అయితే, దీపికా సైలెంట్‌గా ఉండడమే కాదు, ఆమె నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పోస్టు కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. దీపికా పదకొనే , షారుక్ ఖాన్‌తో రాబోతున్న కొత్త సినిమాలో పనిచేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. "18 ఏళ్ళ క్రితం “ఓం శాంతి ఓం” సినిమా చేస్తున్నప్పుడు, షారుక్ ఖాన్ తనకు మొదటి పాఠం నేర్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో నేర్చుకున్న పాఠం ఇప్పటికీ ఆమె గుర్తుందని, ఎవరితో పనిచేస్తున్నామో, ఒక సినిమాతో ఏమి నేర్చుకున్నామో ఎక్కువగా ముఖ్యం అని, సినిమా విజయం కంటే ఎక్కువ ముఖ్యమైన పాఠాలు ఆ రోజున ఆమెకు తెలుసు అని చెప్పింది. ఆ పాఠాన్ని ఆమె ప్రతి నిర్ణయంలో అనుసరిస్తున్నారనీ, అందుకే మళ్ళీ షారుక్ ఖాన్‌తో మరో సినిమా చేస్తున్నారనీ పోస్ట్‌లో తెలిపారు".

 

ఈ పోస్ట్ తర్వాత, “కల్కి 2” నుండి ఆమెను తీసేయడం ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తున్నాయ్.  దీపికా ఫ్యాన్స్‌ దీని పై ఘాటు గా రియాక్ట్ అవుతున్నారు. మేకర్స్‌ దురుద్దేశంతో ఆమెను తీసేసారని స్పష్టంగా అర్ధమైపోయింది అంటున్నారు. ఈ విధంగా దీపికా దానిని కన్ ఫామ్ చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు.  ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తూ, దీపికా పదకొనే తన మనసులోని ఈ విధంగా కక్కేసింది అంటున్నారు.  చూడాలి ఇప్పుడు  దీనికి “కల్కి 2” మూవీ మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో...??



మరింత సమాచారం తెలుసుకోండి: