మనందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఆయన అభిమానులకు మాత్రమే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు, టాప్ హీరోయిన్స్‌కి, ప్రముఖ దర్శక–నిర్మాతలకే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎంతగానో ఇష్టమని. ఆయన వ్యక్తిత్వం, ఆలోచనల లోతు, సింపుల్ లైఫ్ స్టైల్, పాజిటివ్ ఎనర్జీ అన్నీ కలిపి పవన్ కళ్యాణ్‌ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. అందుకే ఆయన నటించిన సినిమా ఏదైనా వస్తే, కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, చాలా మంది సెలబ్రిటీలు, వారి భార్యలు, పిల్లలు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యామిలీగా థియేటరుకెళ్లి ఎంజాయ్ చేయాలనిపించే మ్యాజిక్ ఉంటుంది.

ఇప్పుడు ఆ స్థాయిలో ట్రెండ్ అవుతున్న సినిమా "ఓజీ". దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా రూపొందిన ఈ భారీ యాక్షన్–గ్యాంగ్‌స్టర్ ఎంటర్‌టైనర్ మరికొద్ది గంటల్లోనే ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఇప్పటికే అతి పెద్ద స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. చిన్నా, పెద్దా, ముసలి అనే తేడా లేకుండా అందరూ ఇప్పుడు "ఓజీ" మేనియాలో తేలిపోతున్నారు. ఈ క్రేజ్ మధ్యలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు కూడా తమ అభిమానాన్ని చూపించడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు ఆయన సోదరుడు శిరీష్ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఈ విషయాన్ని వారు పలు ఇంటర్వ్యూలలో కూడా అనేక సార్లు పంచుకున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు "ఓజీ" రిలీజ్ అవుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తూ దిల్ రాజు సోషల్ మీడియాలో ఒక హృదయానికి హత్తుకునే పోస్ట్ చేశారు.

“పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ మా ప్రయాణంలో తోడుగా నిలిచారు. ఆయన మా కోసం ఎన్నో ఏళ్లుగా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఆయన నటించే ప్రతి చిత్రం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇప్పుడు ‘ఓజీ’ కూడా అలాంటి బ్లాక్‌బస్టర్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఈ భారీ తుఫానులో మేము కూడా ఒక భాగం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది.” దానికి తగ్గట్టే దిల్ రాజు మరియు ఆయన బ్రదర్ శిరీష్ "ఓజీ" మర్చండైజ్ ధరించి ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కేవలం వీరే కాదు, మరో నిర్మాత నాగ వంశీ కూడా "ఓజీ" హుడీ వేసుకుని ఫోటోలు పోస్ట్ చేశారు. అదికూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇదే సమయంలో ఇటీవలే సూపర్ హిట్ సినిమాను అందించిన టిజి విశ్వప్రసాద్ కూడా ఒక అడుగు ముందుకేసి, ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం ప్రకారం, "ఓజీ" ప్రీమియర్స్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్ కోసం అదనంగా ప్రత్యేక షోలను అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అంతేకాదు, రిలీజ్ తర్వాత రోజు కూడా మళ్లీ "ఓజీ" షోలు కొనసాగించేలా ప్లాన్ చేశారు.ఈ అన్ని ఉదాహరణలు ఒక్కటే చెబుతున్నాయి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ అమితమైన అభిమానమే కాకుండా, ఆరాధన ఉంది. ఆయన వ్యక్తిత్వం, ఆయన క్రేజ్, ఆయన సినిమాల పట్ల ఉన్న మాజిక్ అన్నీ కలిపి పవన్ కళ్యాణ్‌ని ఒక ఐకానిక్ ఫిగర్‌గా నిలబెట్టాయి.

“మరెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని థియేటర్లలో వెంటనే టికెట్లు బుక్ చేసుకుని, ఫస్ట్ డే ఫస్ట్ షోలో పవర్ స్టార్ మేనియాను ప్రత్యక్షంగా చూడండి అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. ‘ఓజీ’ సినిమాతో కలిసి సెలబ్రేషన్ మూడ్‌లో ఎంజాయ్ చేయండి.”ఇప్పటికే థియేటర్ల దగ్గర భారీ కట్ అవుట్స్, పాలాభిషేకాలు, భారీ క్యూలతో హంగామా మొదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది పండగ రోజు, మిగతా ప్రేక్షకులందరికీ ఇది ఒక ప్రత్యేకమైన సినీ అనుభవం కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: