పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా సెప్టెంబర్ - 25 రేపటి రోజున రిలీజ్ కాబోతోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు క్షణాలలో అమ్ముడుపోయాయి. OG సినిమా భారీ హైప్ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా వంటి ప్రాంతాలలో కూడా భారీగానే టికెట్స్ అమ్ముడుపోయాయి. అమెరికా వంటి ప్రాంతాలలో కూడా ప్రీమియర్స్ తోనే ఓజీ కలెక్షన్స్ భారీగా రాబట్టినట్లుగా కనిపిస్తోంది.


OG చిత్రానికి బుకింగ్స్ పరంగా అమెరికాలో  చాలా ముందుగానే  ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా OG సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఇప్పటివరకు నార్త్ అమెరికాల 2.6 మిలియన్ డాలర్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది అంటు ప్రకటించారు. అంటే దాదాపుగా  రూ.21 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పవచ్చు. అయితే ఇదంతా కూడా కేవలం ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ తోనే వచ్చింది. గతంలో స్టార్ హీరోల చిత్రాలు కంటే ఈ సినిమాకి థియేటర్లలో చాలా తక్కువగానే విడుదల చేస్తున్నారట.


ముఖ్యంగా కంటెంట్ చివరి నిమిషం వరకు రాకపోవడంతో కొంతమేరకు ఎఫెక్ట్ చూపించిందని.. లేకపోతే  ఈ కలెక్షన్స్ 3 మిలియన్ డాలర్లు దాటేదంటు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్స్ తోనే అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాలలో ఓజీ సినిమా ఎన్నో స్థానంలో ఉందంటే..?

1). ప్రభాస్ కల్కి 2898AD -3.05 మిలియన్ డాలర్స్
2).RRR -2.9 మిలియన్ డాలర్స్
3).OG -2.6 మిలియన్ డాలర్స్
4). దేవర-2.51 మిలియన్ డాలర్స్
5). పుష్ప-2- 2.5 మిలియన్ డాలర్స్
వాస్తవానికి ఈ సినిమాలన్నీ కూడా చాలా థియేటర్లలో విడుదల చేశారు. కానీ వీటన్నిటికంటే తక్కువ థియేటర్లలో ఓజి సినిమాని  రిలీజ్ చేస్తున్న టాప్- 3లో ప్లేస్ సంపాదించింది. మరి ఓజి సినిమా విడుదలైన తర్వాత  ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: