కోలీవుడ్ నటుడు జయం రవి అంటే తెలియని వారు ఉండరు.. ఈయన హీరోగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. దాంతో పాటు ఆస్తులు కూడా బాగానే సంపాదించారని తెలుస్తోంది. అలాంటి జయం రవి  బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లించకపోవడంతో అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపించారనే వార్తలు వినిపిస్తున్నాయి. భార్య ఆర్తితో గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయని  దీంతో వీరిద్దరు వేరువేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. అలాగే తన భార్యకు దూరంగా ఉంటున్నటువంటి జయం రవి తన స్నేహితురాలు అయినటువంటి సింగర్ కెనిషాకు దగ్గరైనట్టు సమాచారం. అంతేకాదు అక్కడక్కడ ఈవెంట్లలో కూడా వీరిద్దరూ కలిసే కనిపిస్తున్నారు.. ఈ విధంగా జయం రవి ఆమె మాయలో పడి కనీసం తన ఇంటి ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితికి చేరారని తెలుస్తోంది.. 

అయితే జయం రవి గత మూడు సంవత్సరాల క్రితమే చెన్నై తూర్పు తీర ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లా కొన్నాడు. ఆ తర్వాత తన భార్య పిల్లలతో అక్కడే నివసించాడు. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ గొడవలు జరిగి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం అదే ఇంట్లో తన భార్య పిల్లలతో కలిసి ఉంటుంది. దీంతో జయం రవి గత పది నెలలుగా ఆ ఇంటి ఈఎంఐ కూడా కట్టకుండా వదిలేశాడు. మొత్తం7 కోట్లకు పైగా లోన్ ఉండడంతో బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించి చివరికి ఇంటి వద్దకు వచ్చి నోటీసులు అంటించి వెళ్లారు. అదే కాకుండా జయం రవి స్టూడియోకు కూడా నోటీసులు అంటించారు.

 అయితే రవి తన భార్య ఆ ఇంట్లో ఉటుందని చెప్పి ఈఎంఐలు కట్టకుండా ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఆఫీసుకు బ్యాంక్ అధికారులు నోటీసులు వేసిన తర్వాత కార్యాలయ సిబ్బంది దాన్ని చించివేశారట. ఇది కాస్త వార్తల్లో రావడంతో ఈ ఘటన మొత్తం బయటపడింది.. అంతేకాదు జయం రవి భార్యతో విభేదాలు ఉన్నాయని కూడా అందరికీ క్లారిటీ వచ్చింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ  భార్యను ఒంటరి చేసి జయం రవి మరో అమ్మాయితో ఉంటున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది తాళి కట్టిన భార్యకు ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడేశారు జయం రవికి ఇది న్యాయం కాదంటూ రాస్కొస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యాటర్ కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మీడియాలో హల్చల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: