
ఆమె మరెవరో కాదు.. అందాల తార ఐశ్వర్య రాయ్. ప్రపంచ అందాల రాణిగా పేరు తెచ్చుకున్న ఈమె, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల వరకు తన ప్రతిభను చాటుకుంది. కానీ రజినీ సినిమాల విషయంలో మాత్రం వరుసగా అవకాశాలు వదులుకోవడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. మొదటగా పడయ్యప్ప (నరసింహా) సినిమాలో విలన్ పాత్రలోని నీలాంబరి రోల్‌కి ఐశ్వర్యను సంప్రదించారట. కానీ అప్పటికే మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత వచ్చిన బాబా సినిమాలో హీరోయిన్‌గా నటించమని కోరగా, మళ్లీ సున్నితంగా నిరాకరించిందట. ఈ అవకాశం చివరికి మనీషా కొయిరాల ల్యాప్‌లో పడింది. ఆ తర్వాత శివాజీ మూవీ, చంద్రముఖి కోసం కూడా చర్చలు జరగ్గా, అవి సక్సెస్ కాలేదు.
అయితే చివరికి దర్శకుడు శంకర్ పట్టుదలతో, 2010లో వచ్చిన రోబో సినిమాలో రజనీకాంత్ సరసన ఐశ్వర్య రాయ్ నటించింది. ఈ జంట స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసి, సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఒకవేళ ముందుగానే రజినీతో కలిసి నటించి ఉండి ఉంటే, ఆమె కెరీర్ మరింత భిన్నంగా ఉండేదేమో అన్న చర్చ అప్పట్లో నడిచింది. ప్రస్తుతం ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉంటూ, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోంది. మరోవైపు రజినీ మాత్రం ఇంకా సినిమాల్లో యాక్టివ్‌గా కొనసాగుతూ, జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మొత్తానికి, రజినీ సినిమా అనే మాటకే హీరోయిన్లు క్యూ కడుతుంటే.. ఐశ్వర్య మాత్రం మూడుసార్లు వదిలేసి నాలుగోసారి మాత్రమే అవకాశం పట్టుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.