మలయాళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన మమ్ముట్టి గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మమ్ముట్టి  ఆ ఆరోగ్య సమస్యల నుంచి పూర్తి కోలుకున్నట్లుగా తెలిసింది. తిరిగి మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మహేష్ నారాయణన్ ఈ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్ తో మమ్ముట్టి అభిమానులు పిచ్చ హ్యాపీతో ఉన్నారు.


మహేష్ నారాయణన్ మాట్లాడుతూ.. మమ్ముట్టి గారి ఆరోగ్యం ప్రస్తుతం బాగుంది కనుక అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఆయన సినిమా షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నారని.. ఆయన త్వరగా కోలుకున్నందుకు మా అందరికీ ఆనందంగా ఉంది. ఆ విషయాన్ని మాటలలో చెప్పలేమంటూ తెలిపారు. ఆయన విశ్రాంతి తీసుకుంటూ కూడా సినిమా గురించి ఎక్కువగా ఆలోచించే వారిని తాను ప్రతిరోజు షూటింగ్ అప్డేట్ కూడా ఆయనకి ఇచ్చేవాడినంటూ తెలిపారు మహేష్ నారాయణన్ . సినిమా షూటింగ్ లొకేషన్లో మమ్ముట్టి గారు లేకపోయినా ఆయన మాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుందని తెలిపారు.


మహేష్ నారాయణన్, మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న "పెట్రియాట్" సినిమాలో మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ వంటి వారు కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మలయాళ ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులలోనే మమ్ముట్టి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో కొంతమేరకు సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ లో మమ్ముట్టి ఆరోగ్యం బాగా లేదనే విధంగా వార్తలు వైరల్ గా మారాయి. ఈ విషయం పైన అభిమానులు ఆందోళన చెందినప్పటికీ టీమ్ ఆ విషయాలను కొట్టి పారేసింది. కానీ ఆ తర్వాత మమ్ముట్టి గారికి కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న మాట వాస్తవమే అది చిన్నదే ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ స్పష్టత ఇచ్చింది.. ఇప్పుడు ఒక్కసారిగా  తిరిగి సినిమా షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నారని తెలిసి అభిమానిని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: