
దానికి ప్రధాన కారణం – ఆయన విడాకులు. ఇటీవలే జీవి ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించగానే, అభిమానులు తీవ్రంగా స్పందించారు.“నువ్వు ఇలాంటి వాడివా?”, “నువ్వు అందరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా ఎలా చేస్తావు?” అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన జీవి ప్రకాష్ ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటి? అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. సమంత–నాగచైతన్య విడాకుల తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా చర్చ అయిన విడాకుల టాపిక్‌గా వీళ్లదే అని చెప్పుకోవాలి. “సైంధవి – జీవి ప్రకాష్ విడాకులు” అనే విషయమే ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
2013లో జీవి ప్రకాష్ తన స్కూల్ ఫ్రెండ్ అయిన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ కాలక్రమేణా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో, వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. చెన్నై హైకోర్టులో విడాకుల పిటిషన్ వేసిన ఈ జంటకు, ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. దాంతో ఇకపై వీరిద్దరూ భార్యాభర్తలు కాకుండా, వేరువేరుగా జీవించాల్సి ఉంటుంది. ఈ వార్త బయటకొచ్చిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. “మా హృదయాలు ముక్కలయ్యాయి, ఇక మీదట మీ మీద నమ్మకం పెట్టుకోం” అంటూ కొందరు వైల్డ్‌గా స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం వారి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. కానీ మొత్తంగా చెప్పాలంటే, తమ ప్రేమ బంధాన్ని ఇలా ముగించుకోవడం ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశను కలిగించింది.