
ఈ వేడుకలో తమన్ అల్లరి, దర్శకుడు సుజిత్ చెప్పిన హృదయానికి హత్తుకునే మాటలు, అలాగే పవన్ కళ్యాణ్ వేదికపై కనబడిన సింప్లిసిటీ మొత్తం ఈ విజయోత్సవాన్ని మరింత గుర్తుండిపోయేలా చేశాయి. అయితే కొందరు అభిమానులు, సోషల్ మీడియా వేదికగా, ఒక అంశాన్ని మాత్రమే చర్చించుకున్నారు. అది పవన్ కళ్యాణ్ ఉత్సాహం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడుస్తూ, అపారమైన ఎనర్జీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మాత్రం కాస్త నీరసంగా కనిపించారని అభిమానులు గమనించారు.
దానికి కారణం ఏమిటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడవడం వల్ల ఆయనకు జ్వరం రావడం, ఆ ఫీవర్ కారణంగా ఐదు రోజుల పాటు బాగా ఇబ్బంది పడటం. వైద్యులు కూడా సక్సెస్ మీట్‌కి హాజరుకావద్దని సలహా ఇచ్చారని సమాచారం. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసమే మొండిగా ఈ వేడుకకు వచ్చారని, అందుకే వేదికపై కొంచెం అలసటగా కనిపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రసంగం వినిపించినా ఆ నీరసం కనిపించిందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ చిన్న లోటు మినహా, ఓ జీ విజయోత్సవం అద్భుతంగా జరిగింది. అభిమానులు, సినిమా టీమ్ అందరూ ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేశారు. సుజిత్ డైరెక్షన్ ఈ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లలో చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి అసలు ఆత్మగా మారి, క్లైమాక్స్ వరకు సినిమా విజయాన్ని భుజాన వేసుకుని నడిపించిందని చెప్పాలి.
మొత్తం మీద, ఓ జీ పవర్‌స్టార్ కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవడమే కాకుండా, ఆయన అభిమానులకు చిరస్మరణీయ అనుభూతిని అందించింది. ఈ సినిమా సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ మరోసారి తనకున్న స్థాయి ఏంటో ఇండస్ట్రీకి నిరూపించాడు. అభిమానులు ఇప్పుడు ఓ జీ యూనివర్స్‌కి మరిన్ని చాప్టర్స్ రావాలని కోరుకుంటూ, సక్సెస్‌లో మునిగిపోయి ఆనందిస్తున్నారు..!!