
మీకు ఒక విషయం చెప్పాలి ... అసలు ఇప్పటివరకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలియదు . త్రివిక్రమ్ నేను మాట్లాడుకుంటున్నప్పుడు సుజిత్ టాపిక్ వచ్చింది . అలా ఓజి స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది . అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే .. మీరు ఒక కత్తి పట్టుకుని జపనీస్ డ్రెస్ లో ఉంటారు . గన్స్ ఉంటాయి మీరు ఒక గ్యాంగ్ స్టార్. అలాగే చెప్పాడు కదా .. నాకు ఏం అర్థం కాలేదు . కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్ ను మా అబ్బాయి అకిరా నందన్ చదువుతూ చాలా ఆనందం పడుతూ ఉండేవాడు . అప్పుడు అనిపించింది ఈ తరం వాళ్లకి అర్థం అయ్యే కదే ఓజి మూవీ అని . సుజిత్ చాలా బాగా చేశాడు . అందువలనే సుజిత్ కి నేను ఒక మాట ఇచ్చాను .
ఓజీ సీక్వెల్ గానీ ఫ్రీక్వెల్ గానీ మనం చేస్తున్నామని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు . కానీ ఓజి మూవీ నాకు మళ్ళీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది . కనుక నాకు ఉన్న సమయంలో ఓజీ యూనివర్సిటీ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను . మరీ ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది . అలానే అర్జున్ దాస్ అతని చూసినప్పుడు నేను చాలా ఫీల్ అవుతాను. అలాంటి గొంతు నాకు ఎందుకు లేదని " అంటూ పవర్ స్టార్ కామెంట్స్ చేశారు .