పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఏపీ డిప్యూటీ సీఎం తాజాగా హీరోగా నటించిన మూవీ ఓజి ‌. సుజిత్ డైరెక్షన్లో డివిడి ఎంటర్టైన్మెంట్ పతాకం పై డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25వ తారీకున థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . పవన్ కళ్యాణ్ ను మునిపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో దర్శకుడు సుజిత్ చూపించాడు . దీంతో పవన అభిమానులు ఫుల్ ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు . పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ మరియు సుజిత్ డైరెక్షన్ ప్రతిభా తమ అద్భుతమైన సంగీతం కలవడంతో ఓచి నీ హాలీవుడ్ స్థాయి చిత్రంగా నిలిపాయి  .


మూవీ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల మెప్పును పొందుతూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది . మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 252 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టి క్రేజీ రికార్డ్ ను సృష్టించింది . పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రోస్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఈ చిత్రం నిలిచింది . ఇక ఈ సినిమా సక్సెస్ వేడుకలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. " పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ దసరా శుభాకాంక్షలు . ఓజి సినిమా ప్రకటించినప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పడేలా చేశాడు సుజిత్ . ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు పవర్ స్టార్ ని మనం ఎలా చూడాలి అనుకున్నాము అలాంటి లుక్ లో చూసినప్పటినుంచి సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తెలుగు ప్రజలంతా ఎంతగానో ఎదురు చూశారు .


సెప్టెంబర్ 24 రాత్రి సుధర్మన్ థియేటర్ లోనే నేను కూడా సినిమా చూడడం జరిగింది ‌. పవర్ స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో నాకు తొలిప్రేమ సినిమా నుంచి తెలుసు . అయితే ఇలాంటి సినిమా నీ రాసి పవన్ కళ్యాణ్ ను ఒప్పించినందుకు సుజిత్ కి చాలా థాంక్స్ . అదేవిధంగా ఇలాంటి ఒక బ్లాక్ పాస్టర్ ఆల్బమ్ ఇచ్చినందుకు తమన్ కి కూడా చాలా థాంక్స్ ‌. చివరిగా ఒక మాట పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏడాదికి ఒక్కసారి ఒజీ లాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నా " అంటూ దిల్ రాజు కామెంట్స్ చేశాడు . ప్రజెంట్ దిల్ రాజు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: