ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే.  ఇద్దరు స్టార్ ల పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక్కో రోజూ సినిమా వార్తలలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లలో ఈ ఇద్దరి పేర్లు చకచకా రన్ అవుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు – స్టార్ హీరో రామ్ చరణ్ మరియు జీనియస్ డైరెక్టర్ సుకుమార్.తెలుగు సినిమా అభిమానులు ఎప్పటినుంచో తమ ఫేవరెట్ హీరోల మీద అంతులేని ప్రేమ చూపిస్తూ ఉంటారు. హీరోల సినిమాలు ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉండాలి అన్నదీ ఇప్పుడు అభిమానులే డిసైడ్ చేస్తున్నట్టే ఉంది. సోషల్ మీడియా యుగం వచ్చాక, ఫ్యాన్స్ వాయిస్ మరింత శక్తివంతమైంది. ప్రతి చిన్న అప్‌డేట్, లుక్, టీజర్, సాంగ్ — అన్నీ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హైప్ చేస్తేనే బజ్ క్రియేట్ అవుతుంది.


ఇలాంటి టైంలో, రామ్ చరణ్సుకుమార్ కాంబినేషన్ గురించిన వార్త వెలుగులోకి రావడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక షాక్‌లో పడింది. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని అందరికీ తెలుసు. “రంగస్థలం” సినిమా ద్వారా వీరిద్దరూ ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చారు. ఆ సినిమాతో రామ్ చరణ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ తగిలింది, సుకుమార్ డైరెక్షన్ మీద మరో లెవెల్ నమ్మకం ఏర్పడింది.ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని తెలిసిన వెంటనే ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. కానీ మరోవైపు, ఒక భయం కూడా మొదలైంది. ఎందుకంటే, ఇంతకుముందు ఇలాంటి పరిస్థితిని డైరెక్టర్ కొరటాల శివ ఫేస్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ ఆర్ ఆర్” సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్‌లో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఆయనతో “ఆచార్య” సినిమా తీసిన కొరటాల శివపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. “ఆర్ ఆర్ ఆర్” కన్నా పెద్ద సినిమా కావాలి, రామ్ చరణ్‌ని మాస్, ఎమోషన్, స్టైల్ అన్ని యాంగిల్స్‌లో చూపించాలి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక వాతావరణం క్రియేట్ చేశారు. కానీ చివరికి ఆ సినిమా ఫలితం మాత్రం నిరాశపరిచింది.



ఇప్పుడు అదే పరిస్థితి సుకుమార్ ముందు కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసేసాడు సుక్కు. ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా ఆలోచిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే, అభిమానుల అంచనాలు చాలా హై. రామ్ చరణ్ ఈ సినిమాలో ఏ లుక్‌లో కనిపిస్తాడో, ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయో, మ్యూజిక్ ఎవరు ఇస్తారో అనే ప్రతీ డీటైల్ మీద కూడా ఫ్యాన్స్ కళ్లుపెట్టారు.ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చూస్తే — “ఈ సినిమా రంగస్థలం లెవెల్‌కి మించి ఉండాలి”, “సుకుమార్ అంటే మైండ్ గేమ్స్, చరణ్ అంటే మాస్ ఎమోషన్ – వీరిద్దరి కాంబినేషన్ ఫైర్ అవ్వాలి” అంటూ ఎగ్జైట్మెంట్ పీక్‌కి చేరింది. మరి ఈ అంచనాలు తీరకపోతే? అదే పరిస్థితి బుచ్చిబాబు దిశా చూపుతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవుతాయని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి.



ఈ నేపధ్యంలో సుకుమార్ చాలా జాగ్రత్తగా తన స్క్రిప్ట్‌ను ఒకటికి పది సార్లు పునఃపరిశీలిస్తున్నాడట. రామ్ చరణ్ ఏ యాంగిల్‌లో ఎక్కువగా కనెక్ట్ అవుతాడో, ఎక్కడ ఫ్యాన్స్ కేకలు వేస్తారో అన్నది గమనించి, అటువంటి సీన్‌లు, ఎమోషన్‌లు, హై మోమెంట్స్ పెంచుతున్నాడట.ఇక రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని, సుకుమార్ మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాడని సమాచారం. “ఈ సినిమా తప్పనిసరిగా ఒక పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అవ్వాలి” అనే టార్గెట్‌తో ఇద్దరూ ముందుకు వెళ్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: