భోజ్‌పురి నటుడుగా పేరుపొందిన పవన్ సింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు పొలిటికల్ పరంగా కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే ఒక స్టేజి మీద ప్రముఖ హీరోయిన్ "అంజలి రాఘవన్ " ను చాలా అసభ్యకరంగా తాగి వార్తలలో నిలిచారు. ఈ విషయంపై అంజలి భోజ్‌పురి ఇండస్ట్రీని వదిలేస్తానంటూ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ విషయంపై పవన్ క్షమాపణలు కూడా తెలియజేశారు. ఇలాంటి ఆరోపణల మధ్య ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకున్నారు పవన్ సింగ్.


పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ తన భర్త పైన ఆరోపణలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది. తన భర్త మరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని హోటల్లో ఉంటున్నారని..తన ఇంటికి వెళితే తన మీదే ఎఫ్ఐఆర్ దాఖలు చేయించి పోలీసుల చేత తనని గెంటేయించాలని చూస్తున్నారంటు తెలిపింది. అలాంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు! ఎన్నికల సమయంలోనే నా పేరును వాడుకున్నారు అవి అయిపోయాక ఇప్పుడు మరొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది.


చాలామంది తనను ఎందుకు మీ భర్త ఇంటికి వెళ్లడం లేదని అడుగుతున్నారు?.. పవన్ చేస్తున్న తప్పులను ప్రశ్నించకుండా కేవలం నన్ను మాత్రమే నిందిస్తూ ఉండడం చాలా బాధగా అనిపించిందని తెలిపింది పవన్ భార్య జ్యోతి సింగ్. పవన్ మాత్రం తన ముందు ఇతర అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానని తెలియజేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ సింగ్ కి 2014 లో  ప్రియ కుమారితో వివాహం కాగా, ఏడాదికే మనస్పర్ధలు రావడంతో విడిపోయారట. ఆ తర్వాత మళ్లీ జ్యోతిని ప్రేమించి మరి పవన్ సింగ్ 2018 లో వివాహం చేసుకున్నారు. మొత్తానికి పవన్ భార్య చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: