
అనంతరం ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రాజకీయాలలో రాణిస్తుంది . ప్రజెంట్ తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రాజకీయాలకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే ఇటీవల ఓ రాజకీయ పోస్ట్ పెట్టగా దీనిపై ఓ ప్రేక్షకులు స్పందిస్తూ .. " నిజంగానే వ్యంగ్య స్వీట్లు చేయగలరా లేక దీనికి చాట్ జిపిటిని ఉపయోగిస్తున్నారా? మీ ఎనిమిదవ తరగతి చదువు మాకు తెలుసు " అంటూ నవ్వుతున్న అమెజాన్ షేర్ చేశాడు .
దీనిపై నటి కుష్బూ స్పందిస్తూ.. " తెలివితేటలు అనేవి మీ అకాడమిక్ రిపోర్ట్ కార్డు ఫలితాలు గురించి కాదు . తెలివితేటలు అంటే జీవితం మీకు ఏమీ నేర్పించిందనే దాని గురించి . కామరాజు లాంటి గొప్ప రాజు నితిజ్ఞుడు కూడా నాలుగో తరగతి కంటే ఎక్కువగా చదువుకోలేదు బ్రదర్ . కాబట్టి ప్రశాంతంగా ఉండండి . నా ఆలోచనలను వ్యక్తం చేయడానికి నాకు చాట్ జెపిటి అవసరం లేదు " అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కుష్బూ . ప్రజెంట్ ఈమె కామెంట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి .