కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలన కాంబో రెడీ కాబోతోంది . సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ఉలగా నాయిగన్ కమల్ హాసన్ కాంబినేషన్లో మూవీ రూపొందిన ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు . బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఈ ఇద్దరు స్టార్స్ నువ్విలా నేనిలా అని పోటీపడిన సూపర్ స్టార్ రజిని మరియు కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించనున్నారు . ఈ ఇద్దరు కలిసి ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నారు . ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ దుబాయిలో జరిగిన సైమా అవార్డు కార్యక్రమంలో కన్ఫామ్ చేయడం జరిగింది .


మూవీ ను తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ తర్కెక్కించడం లేదని ఇటీవల వార్తలు వినిపించడం జరిగింది . లోకేష్ కనకరాజ్ ఈ మూవీకు కథ మాత్రమే అందిస్తాడని ఆ కథతో తమిళ్ యంగ్ హీరో కం డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తర్కత్వంలో రజనీకాంత్ మరియు కమల్ హాసన్ మూవీ చేస్తారని తమిళ్ సినీ మీడియా లో చర్చలు జరుగుతున్నాయి . కానీ అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు . ఇక తాజాగా ఈ వార్తలపై స్పందించాడు ప్రదీప్ రంగనాథ్ .


ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ.. " నేను సూపర్ స్టార్ కు బిగ్ ఫ్యాన్ . ఆయన సినిమా ఏది నేను ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వను ‌. అలాగే రజనీకాంత్ మరియు కమల్ హాసన్ సినిమాను నేను డైరెక్ట్ చేయడం లేదు . నేను ప్రస్తుతం నటనపై మాత్రమే దృష్టి పెట్టాను . అసలు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ సినిమా డైరెక్షన్ కోసం నాకు ఆఫర్ వస్తుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను " అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథ్ . ప్రజెంట్ ఈ నవ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: