టాలీవుడ్, కోలీవుడ్,మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది కళ్యాణి ప్రియదర్శన్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన లోక చాప్టర్1 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో తన పేరు వినిపించేలా చేసింది. కేవలం రూ .30 కోట్ల రూపాయల ఖర్చుతో అదిరిపోయే విజువల్స్ తో సరికొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆగస్టు 29న లోక చాప్టర్ 1 సినిమా విడుదలవ్వగా ఇప్పటికీ థియేటర్లో ఆడుతోంది.


అయితే ఇప్పటికే ఈ సినిమా రూ .300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పటివరకు మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటించిన L2 ఎంపురాన్ సినిమా రూ.265 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత మోహన్ లాల్ నటించిన తుడురమ్ సినిమా రూ .240 కోట్లతో రెండవ స్థానంలో ఉండగా, ఇప్పుడు లోక చాప్టర్ 1 చిత్రం ఏకంగా రూ .300 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నది. దీంతో స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి మరి కళ్యాణి ప్రియదర్శిన్ సినిమా టాప్ లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.



లేడి ఓరియంటెడ్ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరని కూడా వెనక్కి నెట్టి మరి అత్యధిక కలెక్షన్స్ తో దూసుకుపోతోంది లోక మూవీ. ఈ చిత్రాన్ని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ నిర్మించారు. దర్శకుడిగా డోమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.లోక చాప్టర్ సినిమా యూనివర్స్ గా రాబోతున్నాయి, సుమారుగా 7 సినిమాలు అయితే పక్కాగా ఉండబోతున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రెండు, మూడు చిత్రాలలో దుల్కర్ సల్మాన్ , టోవినో థామస్ మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నారు. వీరిద్దరూ కూడా లోక చాప్టర్1 చిత్రంలో గెస్ట్ అపీరియన్స్ పాత్రలో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: