బండ్ల గణేష్ దీపావళి పండగ వచ్చిందంటే చాలు ఎప్పుడు తన ఇంటి ముందు లక్షలాది క్రాకర్స్ పెట్టి రికార్డు సృష్టించాలని చూస్తాడు.అయితే ఎప్పుడు బాంబులు,క్రాకర్స్ తో కనిపించే బండ్ల గణేష్ ఈసారి మాత్రం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలందరికీ గ్రాండ్గా దివాళి పార్టీని ఇచ్చారు. ఇక ఈ దీవాళీ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇక చిరంజీవి కార్ లో నుండి బయటికి దిగడంతోనే బండ్ల గణేష్ ఆయన కాళ్లు మొక్కి వెల్కమ్ చెప్పారు. ఇక చిరంజీవితో పాటు వెంకటేష్,యంగ్ హీరో తేజ సజ్జా, సిద్ధూ జొన్నలగడ్డ, డైరెక్టర్ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి వంటి కొంతమంది సెలబ్రిటీలను ఆహ్వానించారు.అయితే వీరందరికీ దీవాళీ పార్టీ పేరుతో భారీగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ బండ్ల గణేష్ దివాళి పార్టీ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. 

ఇక బండ్ల గణేష్ సెలబ్రిటీలకు ఇచ్చిన దివాళి పార్టీ కోసం ఏకంగా రెండు కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఒక్కో సెలబ్రిటీకి ఇచ్చే డిన్నర్ ప్లేట్ ఖర్చే 15,000 రూపాయలట. అలా కేవలం ఫుడ్ కోసమే బండ్ల గణేష్ దాదాపు కోటిన్నర వరకు ఖర్చు పెట్టారట. ఇక మిగతా ఏర్పాట్లను కూడా కలుపుకొని లెక్కేస్తే దాదాపు రెండు కోట్లకు పైగానే పార్టీ కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అలా రెండు కోట్ల ఖర్చు పెట్టి దివాళి పార్టీ పేరుతో ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు బండ్ల గణేష్ గ్రాండ్గా పార్టీ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఇక బండ్ల గణేష్ పార్టీ ఖర్చు తెలిసిన చాలా మంది నెటిజెన్లు బండ్లన్న పార్టీ కి పెట్టిన ఆ డబ్బులతో ఓ చిన్నపాటి సినిమా తీసేయొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బండ్ల గణేష్ ఇచ్చిన పార్టీలో త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ,నందమూరి ఫ్యామిలీ,మహేష్ బాబు ఫ్యామిలీకి ఆహ్వానం లేదు కావచ్చు. అందుకే మిగతా సెలబ్రెటీలు ఎవరు ఈ పార్టీలో కనిపించలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: