
గతంలో ఈయన రాజకీయ విశ్లేషకుడిగా మీడియాలలో కనిపించేవారు కొలికపూడి.వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేస్తోంది తప్పు అంటూ అమరావతి భూముల ఇష్యూలో ఉద్యమాలలో కీలకమైన పాత్ర పోషించారు కొలికపూడి. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కావడం చేత టిడిపి పార్టీ గుర్తించి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యేగా టికెట్ తీసుకుని మరి గెలిచారు. అయితే తనలో ఉన్న నిజాయితీని మాత్రం కోల్పోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. తన నిజాయితీని తొక్కేయడానికి జరుగుతున్న విషయాన్ని సహించలేకపోతున్నారు ఎమ్మెల్యే. గతంలో తన నియోజకవర్గంలోని బెల్టు షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించినందుకుగాను అధిష్టానం పిలిచి మరి వార్నింగ్ ఇచ్చింది. అయితే వీటన్నిటిని తెర వెనుక కాదు తెర ముందుండి జరిపించింది ఎవరంటే ఎంపీ అన్నట్లుగా స్పష్టంగా తెలియజేస్తున్నారు కొలికపూడి.
ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంపీ కార్యాలయంలో కూర్చొని, పార్టీ కమిటీలు వేస్తారని గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశారు. నామినేటెడ్ పోస్టులకు కూడా డబ్బులు వసూల్ చేశారు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం కూడా ఈ దందా దగ్గరుండి మరి నడిపిస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే ఫైరయ్యారు. తిరువూరులో కిషోర్ రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, బెల్ట్ షాపుల మాఫియా నడిపిస్తున్నారని అన్ని విషయాలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తా ఈనెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళబోతున్నామని అక్కడ తాడోపేడో తెలుసుకుంటాం అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ తెలియజేశారు.