
ఈ సక్సెస్ మీట్ లో సీనియర్ హీరో నరేష్ మాట్లాడుతూ తన రెండు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉన్నానని ఇప్పటివరకు 200 కు పైగా నిర్మాతలను తాను చూశానని, కానీ చాలామంది నిర్మాతలు ఆర్టిస్టులకు కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుందనుకుంటారు. ఎంత కష్టపడి పని చేశామనే విషయం వారికి తెలియదు. కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ కాస్తంత మర్యాద కూడా ఇవ్వాలి అంటూ తెలియజేశారు. ఈ విషయంలో మిగతా నిర్మాతల కంటే రాజేష్ చాలా బెటర్ అంటూ తెలియజేశారు. ఆయన ఆర్టిస్టులకు చాలా గౌరవిస్తారని వెల్లడించారు.
అందుకే నిర్మాత రాజేష్ అంటే తనకు చాలా ఇష్టమని కిరణ్ అబ్బవరం సినిమా హిట్ కావడం తనకి చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఈ యంగ్ టీమ్ ఎంత కష్టపడ్డారో నాకే తెలుసు, ఆ కష్టానికి నిదర్శనమే ఈ విజయం అంటూ తెలియజేశారు వీకే నరేష్. ప్రస్తుతం వీకే నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గడచిన కొంతకాలం క్రితం ప్రముఖ నటి పవిత్ర లోకేష్ విషయం పైన కూడా వార్తలలో నిలిచిన నరేష్ ఇప్పుడు తాజాగా మరొకసారి వార్తలలో నిలుస్తున్నారు.