ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతూ ఉంది. “రానా తండ్రి కాబోతున్నాడు” అనే పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియాలో “Congratulations rana & Miheeka!” ” అంటూ శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.ఇక రానా లేదా మీహికా ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త నిజమే కావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రానా దగ్గుబాటికి ఉన్న క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆయన నటనలో ఉన్న వైవిధ్యం, స్క్రీన్ ప్రెజెన్స్, మరియు ఫ్రెండ్లీ నేచర్ ఆయనను అందరికీ దగ్గరగా చేసింది. “బాహుబలి” సిరీస్‌లోని భల్లాలదేవ పాత్రతో దేశవ్యాప్తంగా రానాకు విపరీతమైన పేరు వచ్చింది. ఇటు హీరోగా, అటు విలన్‌గా కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. బాలీవుడ్‌లో కూడా ఆయనకు బలమైన అభిమాన వర్గం ఉంది.
అలాంటి స్టార్ హీరో తండ్రి కాబోతున్నాడంటే అది అభిమానులకు నిజంగానే పండగలాంటిదే. దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఈ హ్యాపీ న్యూస్‌ను చాలా గ్రాండ్‌గా అనౌన్స్ చేయాలన్న ఆలోచనలో ఉందని సమాచారం. రానా – మీహికా జంట ఎప్పుడు అధికారికంగా ఈ సంతోషాన్ని పంచుకుంటారో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది. రాంచరణ్ – ఉపాసన, రానా – మీహికా ఇద్దరూ తమ జీవితంలో మధురమైన కొత్త అధ్యాయం ప్రారంభించబోతుండగా, అభిమానులు సోషల్ మీడియాలో వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు తండ్రులు కానుండటంతో, ఈ ఏడాది చివరి త్రైమాసికం నిజంగానే “హ్యాపీ న్యూస్ సీజన్”గా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి