అనిల్ రావిపూడి సినిమాలంటేనే హ్యూమర్, ఎమోషన్, ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చింది. "పటాస్" నుంచి "సంక్రాంతికి వస్తున్నాం", వరకు — ప్రతి సినిమా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ భావోద్వేగాన్ని కలపాలి అనేది అనిల్ రావిపూడి బాగా తెలిసిన దర్శకుడు. అందుకే ఆయన సినిమాలు కేవలం హాస్యం మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను తాకే భావోద్వేగాలతో కూడిన పండుగలా అనిపిస్తాయి. ఇప్పుడు అదే అనిల్ రావిపూడి, మన మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తున్నాడు.   "మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు" సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన భాగం పూర్తి కాగా, తుది షెడ్యూల్ కూడా దాదాపు ముగింపు దశలో ఉందట. త్వరలోనే సినిమా ప్రమోషన్లు గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.అనిల్ రావిపూడి స్టైల్ అందరికీ తెలిసిందే — ఆయన సినిమా మొదలైన రోజు నుంచే ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ప్రమోషన్ మోడ్‌లోకి వెళ్తారు. అదే కారణంగా ఆయన సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి భారీ హైప్ క్రియేట్ అవుతుంది, రిజల్ట్‌గా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి.


ఇక ఈ సినిమాలోని క్యాస్టింగ్ విషయానికి వస్తే, ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో, అంటే ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని చిత్రబృందం కొంతకాలం క్రితమే కన్ఫర్మ్ చేసింది. అభిమానులు ఈ వార్త విన్న వెంటనే ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎందుకంటే చిరంజీవివెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అంటే అభిమానులకు డబుల్ ఫెస్టివల్ లాంటిది.కానీ ఇక్కడితో ఆ సర్ప్రైజ్ ముగిసిపోలేదు. అనిల్ రావిపూడి మరో డబుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట! ఆ సర్ప్రైజ్ ఏమిటంటే — ఈ సినిమాలో కేవలం వెంకటేష్ మాత్రమే కాదు, మరో స్టార్ సీనియర్ హీరో కూడా స్పెషల్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఆయన మరెవరో కాదు, కింగ్ నాగార్జున అక్కినేని! . నాగార్జున ఈ మధ్యకాలంలో విలన్ రోల్స్‌లోనూ, తన ప్రతిభను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే ఈసారి ఆయన చిరంజీవి స్నేహితుడి పాత్రలో, అంటే బెస్ట్ ఫ్రెండ్‌గా తెరపై కనిపించబోతున్నారట. ఈ పాత్ర చిన్నదే అయినా సినిమా కథలో కీలక మలుపుగా నిలుస్తుందట.



ఇక వెంకటేష్ విషయానికి వస్తే — ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ రెండు పాత్రలు సినిమా ఇంటర్వెల్ తర్వాతే ఎంటర్ అవుతాయట, అంటే క్లైమాక్స్ వైపు కథకు మరింత బలం ఇచ్చే విధంగా అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడట.సినిమా యూనిట్ లోపల నుండి లీకైన సమాచారం ప్రకారం, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ముగ్గురు ఒకే సీన్‌లో కలిసి కనిపించే ఎపిసోడ్ కూడా ప్లాన్‌లో ఉందట. ఆ సీన్ స్క్రీన్‌పై కనువిందు చేయడమే కాకుండా, థియేటర్లలో చప్పట్లు కొట్టేలా చేస్తుందనటంలో సందేహం లేదు.ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. అభిమానులు "మెగా – విక్టరీ – కింగ్" కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: