ఇప్పుడు ఆయన చేస్తున్న ‘మాస్ జాతర’ మాత్రం అంతకంటే మరింత భారీ స్థాయిలో రూపొందింది. సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్‌లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రత్యేకంగా రవితేజ స్టైలిష్ లుక్స్, ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్స్‌లో ఓ ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు.ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వచ్చిన అప్‌డేట్ మాత్రం అభిమానులలో మరింత ఉత్సాహం నింపింది. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, అక్టోబర్ 28న సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ ప్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం దృష్టి పడింది.
ఇక ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనే అంశంపై కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది టాలీవుడ్ స్టార్ వస్తారని ఊహించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా తమిళ నటుడు, కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అవును..! మీరు విన్నది నిజమే. అమ్మాయిలకు, యువతకు ఫేవరెట్ హీరోగా పేరుగాంచిన సూర్య, ఈ వేడుకలో పాల్గొని రవితేజకు మద్దతు తెలపబోతున్నాడు. రవితేజ - సూర్యల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉందన్న విషయం చాలామందికి తెలిసిందే. ఆ స్నేహం నిమిత్తమే సూర్య ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. సూర్య ఎంట్రీతో ఈ ఈవెంట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన లైవ్ స్టేజ్‌పై కనిపిస్తే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతారని చెప్పాల్సిన అవసరమే లేదు. రవితేజ అభిమానులు, సూర్య అభిమానులు ఇద్దరూ ఒకే వేదికపై తమ హీరోలను చూసే అదృష్టాన్ని పొందబోతున్నారు.చిత్ర బృందం చెబుతున్న ప్రకారం, ఈ ఈవెంట్‌ను గ్రాండ్ స్థాయిలో ప్లాన్ చేశారు. భారీ సెట్స్, స్పెషల్ లైటింగ్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, మరియు మాస్ పాటలతో స్టేజ్ ఒక మినీ ఫెస్టివల్‌లా ముస్తాబవుతుంది. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌లు, ఇన్విటేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 1న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో మరో గోల్డెన్ పేజీని రాయబోతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి