టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు పొందిన శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. రవితేజతో కలిసి నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఇటీవల కాలంలో శ్రీ లీల లుక్స్ లో చాలా మార్పు వచ్చిందని ఎప్పుడూ చలాకీగా నాజూగ్గా కనిపించే ఈ ముద్దుగుమ్మ చాలా స్లిమ్ గా మారిపోయిందనే విధంగా వినిపిస్తున్నాయి. నిరంతరం సోషల్ మీడియాలో స్లిమ్ ఫోటోలతో అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ విషయంపై శ్రీలీల ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపింది.


శ్రీ లీల మాట్లాడుతూ తాను ఫుడ్ విషయంలో కంట్రోల్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని, సరైన ఆహారం తినాలని ఫిక్స్ అయ్యాను,గతంలో తన అమ్మమ్మ ఒంగోలు నుంచి అరిసెలు ఇతరత్రా తినే పదార్థాలను పంపిస్తే ఎక్కువగా తినే దాన్ని, అంతేకాకుండా చెకోడీలు, బజ్జీలు, ఎక్కువగా తినే దాన్ని వాటన్నిటినీ ఇప్పుడు తగ్గించాను అంటూ తెలియజేస్తోంది శ్రీ లీల. ఇలా సన్నబడడంతో ఎక్కువమంది బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాతే స్లిమ్ గా మారిన శ్రీదేవితో పోలుస్తున్నారు. ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చేసింది.


తాను శ్రీదేవిని కాదు, ప్రతి ఒక్కరి శరీరాకృతి  వేరుగా ఉంటుందని, నా బాడీ గురించి నాకు బాగా తెలుసు నేను పైగా డాక్టర్ ని కూడా స్క్రీన్ పై మన కోసం డబ్బులు పెట్టి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కూడా ఉంటున్నారు. కాబట్టి మనం బెస్ట్ గా కనిపించడం కోసమే కష్టపడాలి అందుకే నా లుక్ మీద కాస్త కేర్ తీసుకున్నాను అంటూ తెలియజేసింది శ్రీ లీల. అలాగే మాస్ జాతరలో తన పాత్ర కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని అందులో మాస్ ఫీలింగ్ తో పాటు కామెడీ టచ్ ను కూడా యాడ్ చేశారని తెలిపింది. ఇలాంటి పాత్రలు చేయడం తనకి చాలా ఎంజాయ్మెంట్ అంటూ తెలిపింది  శ్రీలీల.

మరింత సమాచారం తెలుసుకోండి: