తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ నటుల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు.. ఈయన ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఇలా ఎన్నో పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  అలా ఒకప్పుడు కామెడీ హీరోగా ఈయన ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.అలాంటి ఈయన  దాదాపుగా ఏడు పదుల వయస్సుకు దగ్గర పడుతున్నా కానీ  ఇంకా సినిమాలు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. అయితే అలాంటి రాజేంద్రప్రసాద్ ఏ విషయాన్నైనా సరే ముక్కు సూటిగా మాట్లాడతారు.. అయితే తాజాగా ఆయన  రవితేజ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఆయన ఒక సవాల్ కూడా విసిరారు.. అదేంటో వివరాలు చూద్దాం.. మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు.. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. ఇందులో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా చేసింది..

 అలాంటి ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలకు సిద్ధమయింది.. అలాంటి ఈ తరుణంలో తాజాగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  రాజేంద్రప్రసాద్ హాజరై పలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.. ఈ మధ్యకాలంలో అయితే అన్ని మాస్ మసాలాలు కలిసినటువంటి చిత్రం ఒక్కటి కూడా రాలేదని,  రవితేజ నటించిన మాస్ జాతర మూవీని థియేటర్లలో చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని అన్నారు. తాను ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేశానని కానీ రవితేజతో ఒక్క సినిమా చేసి కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టలేదని తెలియజేశారు. కానీ ఈ చిత్రం బ్లాక్ మాస్టర్ హిట్ కొట్టకపోతే నేను సినీ ఫీల్డ్ వదిలేసి బయటకు వెళ్లి పోతానని ఛాలెంజ్ విసిరాడు.

ఎందుకంటే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఆ విధంగా నటించారు.. కథ కూడా చాలా బాగుంటుంది.. ఆయన చాలా సీన్స్ అడిగిమరీ పెట్టించుకున్నారు.. సినిమా ప్రతి ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంటుందని బల్ల గుద్ది మరీ చెప్పారు.. రవితేజను ఇప్పటివరకు ఎవరూ చూడనటువంటి షేడ్స్ లో ఈ సినిమాలో చూస్తారని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమాపై చాలా హైప్ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: