ఆయన మాట్లాడుతూ.. “తమ్ముళ్లూ… ఇటీవల నా సినిమాలు మీ అంచనాలను అందుకోలేదని నాకు తెలుసు. కానీ మాస్ జాతార;ఫ్ అలాంటిదేమీ జరగదు. ఇది నా హామీ!”అని అన్నారు.ఇంత నిజాయితీగా, ఇంత మనస్ఫూర్తిగా అభిమానుల ముందుకి వచ్చిన రవితేజను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నో ఈవెంట్లలో ఆయన హాస్యంతో, ఎనర్జీతో మాట్లాడినా – ఇంత సీరియస్‌గా, హార్ట్ టచింగ్‌గా మాట్లాడటం ఇదే మొదటిసారి అని అభిమానులు చెబుతున్నారు.అంతేకాదు, ఆయన మాట్లాడుతూ, “నాకు సినిమా అంటే పండుగ. ప్రేక్షకులు నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ థియేటర్ నుంచి బయటికొచ్చేంత వరకు నేను పని చేస్తాను. గత కొంతకాలంగా ఆ సంతృప్తి ఇవ్వలేకపోయానని నాకు తెలుసు. కానీ ఈసారి మాత్రం మీ అందరి అంచనాలను మించిపోయే హిట్ ఇవ్వబోతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత మీరు ‘ఇదే మాస్ రాజా!’ అని మళ్లీ గర్వంగా చెబుతారు” అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
ఇంత కచ్చితంగా హామీ ఇచ్చిన రవితేజను చూసి అభిమానులు సోషల్ మీడియాలో ఫిదా అవుతున్నారు. “మాస్ జాతర తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది”, “ఇది రవితేజ రీ-ఎంట్రీ లాంటిది”, “ఎప్పటిలాగే రవితేజ ఎనర్జీ మళ్లీ థియేటర్లలో పేలిపోబోతోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.అదేవిధంగా, ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల కూడా మాట్లాడుతూ, “ఇది నా కెరీర్‌లో చాలా స్పెషల్ సినిమా. రవితేజ గారితో పని చేయడం నిజంగా గౌరవంగా అనిపించింది. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన సెట్‌లో ఉండగానే ఎనర్జీతో నిండిపోతారు” అని చెప్పింది. ఇప్పుడు అందరూ ఒక్కటే అంటున్నారు –“ఇది మాస్ జాతర కాదు బాస్… ఇది రవితేజ జాతార!”
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి