అల్లు శిరీష్ తాజాగా అక్టోబర్ 31న తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అల్లు శిరీష్ నయనిక అనే అమ్మాయితో తన నివాసంలోనే గ్రాండ్గా ఎంగేజ్మెంట్ వేడుకను చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో సినీ సెలబ్రిటీలు ఎంతో మంది హాజరయ్యారు.ముఖ్యంగా ఈ ఎంగేజ్మెంట్లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొనడం సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ లో కనిపించడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ తన లవ్ మేటర్ ని రివీల్ చేశారు. తన లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అక్కడేనని చెప్పారు.అయితే అల్లు శిరీష్ నయనికల మధ్య లవ్ పుట్టడానికి ఆ హీరో భార్యనే కారణమట.

మరి ఇంతకీ వాళ్ళు ఎవరయ్యా అంటే నితిన్ భార్య శాలిని.అవును మీరు వినేది నిజమే.. ఎందుకంటే  ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటిల పెళ్లికి ముందు నితిన్ కాబోయే భార్య భర్తలకి ఒక పార్టీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ పార్టీలో అల్లు శిరీష్ కూడా పాల్గొన్నారు.  అలా ఈ పాrty జరిగిన సమయంలోనే నితిన్ భార్య శాలిని క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి నయనిక కూడా అక్కడికి వచ్చింది. ఇక ఈ పార్టీలోనే నయనిక, అల్లు శిరీష్ మధ్య మొదటిసారి పరిచయం ఏర్పడిందట.
అలా మొదటి పరిచయం కాస్త పెళ్లికి దారి తీసింది.అలా రెండేళ్ల పాటు వీరు ప్రేమించుకున్నారట. ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ విషయాన్ని బయట పెట్టారు. అంతేకాదు నా లవ్ స్టోరీని నా పిల్లలకు ఈ విధంగానే చెబుతాను అమ్మను ఎలా కలిసానో చెబుతాను అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అలాగే నయనిక ఫ్రెండ్స్ కి కూడా థాంక్స్ చెప్పారు.ఇక నితిన్ భార్య శాలిని ఈ పోస్టు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి మీ బ్యూటిఫుల్ స్టోరీలో నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసినా అల్లు శిరీష్ థాంక్యూ పెళ్లి పెద్ద అంటూ పెళ్లి పెద్ద క్రెడిట్ ని శాలిని కి ఇచ్చేశారు. అలా నితిన్ భార్య శాలిని వల్లే అల్లు శిరీష్ నయనికల పెళ్లి జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: