కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు హీరో గా సౌందర్య హీరోయిన్గా ఎన్ శంకర్ దర్శకత్వంలో శ్రీరాములయ్య అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హరి కృష్ణ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. తాజాగా శ్రీరాములయ్య సినిమా దర్శకుడు అయినటువంటి శంకర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా శంకర్ మొదట శ్రీరాములయ్య సినిమాలో హరి కృష్ణ చేసిన పాత్రకు ఎవరిని అనుకున్నాము ..? ఆయన ఎందుకు ఆ ఆఫర్ ను రిజక్ట్ చేశాడు ..? తర్వాత హరి కృష్ణ ను ఎలా శ్రీరాములయ్య సినిమాలో నటించడానికి ఒప్పించాము అనే దాని గురించి క్లియర్ గా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శంకర్ మాట్లాడుతూ ... శ్రీరాములయ్య మూవీ లో మొదట హరి కృష్ణ గారు చేసిన పాత్రకు రజనీ కాంత్ గారిని అనుకున్నాము. అందులో భాగంగా రజనీ కాంత్ గారిని కలిసి ఆ సినిమా కథను ... ఆయన పాత్రను వివరించాము. స్టోరీ మొత్తం తిని ఆయన సినిమా కథ బాగుంది.

నా పాత్ర కూడా బాగుంది. కానీ నేను ఇప్పటికే మోహన్ బాబు తో కలిసి పెదరాయుడు సినిమాలో నటించాను. ఆ సినిమాలోని నా పాత్ర అద్భుతంగా ఉంది. మరోసారి అదే రేంజ్ ఇంపాక్ట్ ఈ సినిమాతో కాదు ... వేరే సినిమాతో కూడా వస్తుందని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఈ సినిమాలో ఆ పాత్ర చేయను అని చెప్పాడు. దానితో ఆ తర్వాత నాకు హరి కృష్ణ గారు ఆ పాత్ర చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దానితో నేను హరి కృష్ణ గారిని వెళ్లి అడిగాను. కానీ ఆయన మాత్రం శ్రీరాములయ్య సినిమాలో అస్సలు ఒప్పుకోలేదు. ఆయన ఎంత ఒప్పుకోకపోయినా నేను ఒప్పించడానికి ప్రయత్నించాను. అలా అనేక సార్లు ఆయన ఆ సినిమాలో చేయను అని చెప్పిన కూడా పట్టుబట్టి మీరు మాత్రమే ఈ పాత్ర చేయగలరు అని నేను చెప్పడంతో ఆయన ఆఖరుగా ఒప్పుకున్నారు అని శంకర్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: