టాలీవుడ్ లో ఒకానొక సమయంలో హీరోయిన్ అద్భుతమైన పాత్రలో నటించింది అనిత హస్పానందిని. మొదటిసారిగా 2001లో విడుదలైన నువ్వు నేను అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అనిత ఈ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. నువ్వు నేను సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ తో కలిసి మళ్ళీ శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నేను పెళ్ళికి రెడీ, ఇది సంగతి, రగడ, జీనియస్ వంటి చిత్రాలలో నటించిన అనిత. ఇక బుల్లితెర పైన కూడా ఈమెకు బాగానే క్రేజ్ ఉన్నది.బాలీవుడ్ లో సీరియల్స్లలో సినిమాలలో కూడా నటించింది.


ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో అనిత మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి కొన్ని విషయాలను తెలిపింది. గతంలో తాను ఎజాజ్ ఖాన్ తో నటుడుతో  ప్రేమలో ఉన్నానని, ఆ ప్రేమలో నేను నా తల్లిని వ్యతిరేకంగా వెళ్లి మరి అతడిని ప్రేమించాను. మా అమ్మ అతను వేరే మతానికి చెందిన వాడు కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని. కానీ తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదు. నటుడు ఎజాజ్ మాత్రం ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండేవారు. మా సంబంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది.


ఎవరైనా సరే మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తే అప్పుడు అది ప్రేమ కాదనే విషయం అర్థం అవుతుంది. నేను అతని మీద పిచ్చి ప్రేమలో ఉన్నాను ఆ సమయంలో ఎవరు ఏమి చెప్పినా కూడా వినకుండా అతడు చెప్పిన వాటికి పూర్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ విషయాలు నన్ను ఒక ఏడాది పాటు బాధించాయని తెలిపింది. ఒంటరిగా ఎన్నోసార్లు ఏడ్చేసానని తెలిపింది. ఎవరైనా సరే మిమ్మల్ని మార్చాలనుకుంటే వారికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీకు కావాల్సినవారు అన్ని విషయాలు  దాచిపెడితే ఏదో తప్పు జరుగుతోందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను దూరం చేయకూడదు అంటూ తెలియజేసింది అనిత. 2013లో అనిత మరొక వ్యక్తి రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: