మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్గా నటించగా ... బాను భోగవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్రమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... రాజేంద్ర ప్రసాద్ , నరేష్ , హైపర్ ఆది ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటించారు. రవితేజ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ఆపజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించడంతో నాగ వంశీ బ్యానర్లో రూపొందిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో రవితేజ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడు అని చాలా మంది భావించారు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా కూడా భారీ అపజయాన్ని ఆల్మోస్ట్ సొంతం చేసుకునేట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 14 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు వివరాలను తెలుసుకుందాం.

14 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.09 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.69 కోట్లు , ఆంధ్ర లో 4.51 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 14 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 10.29 కోట్ల షేర్ ... 18.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 14 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 70 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సిస్ లో 50 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 14 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.49 కోట్ల షేర్ ... 21.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపుగా 20 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 8.5 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేసినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్టుగా నిలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోవడం దాదాపు అసాధ్యం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt