ఉదయ్ కిరణ్.. లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న వారిలో ఉదయ్ కిరణ్ పేరు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో పదిలంగానే ఉంటుంది. ఈయన మరణించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఉదయ్ కిరణ్ పేరు తలుచుకోని ఇండస్ట్రీ జనాలు ప్రేక్షకులు ఉండరు.అయితే అలాంటి ఉదయ్ కిరణ్ చిత్రం,మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో ఈయన పేరు పేరు ఇండస్ట్రీలో ఆకాశమంత ఎత్తుకు వెళ్ళింది. ఉదయ్ కిరణ్ స్టార్ట్డం చూసి కొంతమంది ఓర్వలేదు కూడా.. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురు సుస్మితను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి తర్వాత నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ మధ్య ఎన్నో రూమర్లు వినిపించాయి.

 ముఖ్యంగా ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడానికి కారణం చిరంజీవి ఫ్యామిలీ అని,తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదని చిరంజీవి అలా కక్ష కట్టాడని, ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోయేలా చేసింది కూడా మెగా ఫ్యామిలీనే అంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ఈ ఆరోపణలపై అటు మెగా ఫ్యామిలీ ఇటు ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ ఇద్దరు స్పందించి అలాంటిది ఏమీ లేదు అని క్లియర్ గా చెప్పేసాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ చనిపోయే 6 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారో తెలిపారు. వి ఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ తో కలిసి మనసంతా నువ్వే సినిమా చేశారు.అయితే ఉదయ్ కిరణ్ చనిపోయే 6  రోజుల ముందు వి ఎన్ ఆదిత్య కు కాల్ చేసి రీసెంట్గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమా అద్భుతంగా ఉంది.

ఇలాంటి ఒక కాన్సెప్ట్ రాయు. లేకపోతే ఎవరి దగ్గరైనా తెలుసుకో ఖచ్చితంగా అలాంటి ఒక సినిమా చేద్దాం. ఆయన ఇమేజ్ కంటే తక్కువ కథ ఉన్న సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు.ఇలాంటి ఓ సినిమా మనము చేద్దాం అని డైరెక్టర్ కి చెప్పారట. అలాగే మనసంతా నువ్వే 2 చేద్దాం అని చెప్పినా కూడా ఉదయ్ వినలేదట. అలాగే ఫ్యామిలీ, ఎమోషన్, క్లాస్ ఈ సినిమాలేవి వద్దు.ఒక మాస్ కథ ఉంటే చెప్పమని ఉదయ్ కిరణ్ చనిపోయే 6  రోజుల ముందు డైరెక్టర్ విఎన్ ఆదిత్య కి ఫోన్ చేసి మరీ చెప్పారట.అలా కాల్ చేసిన ఆరు రోజులకే ఉదయ్ కిరణ్ మరణించారంటూ విఎన్ ఆదిత్య చెప్పుకుంటూ బాధపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: