మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలం లో అనేక సినిమాలతో పెద్ద ఎత్తున అపజయా ల ను అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే. రవితేజ అపజయాలను అందుకోవడా నికి ప్రధాన కారణం ఆయన ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తున్నాడు అని , ఆయన చేసే సినిమాలు ఏ మాత్రం కొత్తగా ఉండడం లేదు అని , అందుకే ఆయన సినిమా లు బాక్సా ఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఆయన యంగ్ హీరోయిన్లతో సినిమాలు చేయడం , వారితో డ్యాన్సులు చేయడం , ఇలాంటివి కూడా అసలు బాగుండడం లేదు అనే విమర్శలు ఆయన సినిమాలపై వస్తున్నాయి. కానీ ఆయన మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయన రూట్లో ఆయన వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో ఈయన ఇద్దరు ముద్దు గుమ్మల మధ్య నలిగిపోయే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు , అందులో ఈయన వయస్సు కాస్త ఎక్కువగా ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దానితో రవితేజ కాస్త రూట్ మార్చి సినిమాలు ఓకే చేస్తూ ఉండటంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఇంత లోనే ఈయన మళ్ళీ ధమాకా 2 సినిమాను ఓకే చేసినట్లు ఆ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో మళ్ళీ రవితేజ అదే రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్  రూట్ వైపు వెళుతున్నాడు అని చాలా మంది కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt