అఖండ 2 తాండవం మరికొద్ది రోజుల్లోనే థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో హైప్ రోజు రోజుకు మరింత పెరుగుతూ వస్తోంది. అఖండ మొదటి భాగం ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అదే స్థాయిలో కాకుండా మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా అఖండ 2 ఉండబోతోందని టాక్ నడుస్తోంది.ప్రత్యేకంగా ఈసారి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్—అని ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చిన ప్రతి మ్యూజిక్ స్నిపెట్, ప్రతి బీజీఎం కట్ థియేటర్‌లో స్పీకర్లు షేక్ అయ్యేలా ఉంటుందనే అంచనాలకు దారితీస్తోంది. సినిమా రిలీజ్ కాకుండానే సూపర్ డూపర్ హిట్ అవుతుందని, బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టుతారని అభిమానులు సంపూర్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా, బాలయ్యకు సంబంధించిన కొన్ని నెగిటివ్ కామెంట్లు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇది నందమూరి ఫ్యాన్స్‌కు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. సాధారణంగా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ, అక్కడ సందడే. ఆయన ఉన్నది ఉన్నట్లే మాట్లాడే జెన్యూన్ పర్సన్. ముందోలా–వెనకోలా మాట్లాడడం ఆయనకు రావడం లేదు—ఇది అందరికీ తెలిసిన విషయం.ఇక రీసెంట్‌గా జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య తన స్పీచ్ ముగిసిన తర్వాత మైక్‌ను ఫ్లిప్ చేసే క్రమంలో పొరపాటున కింద పడిపోయింది. ఇది పూర్తిగా సరదాగా, అనుకోకుండా జరిగిన విషయం. కానీ కొంతమంది దీన్ని పెద్ద విషయంలా మార్చి, భూతద్దంలో పెట్టి చూస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.“బాలయ్య ఎందుకు ప్రతిసారీ ఇలా మైక్ విసురుతాడు?”,“అతను కావాలనే ఇలా చేస్తాడు” అంటూ ఘాటు రియాక్షన్స్ ఇస్తున్నారు.



కొంతమంది అయితే అఖండ 2ను డామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు అంటూ నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. "పనిపాటా లేని బ్యాచ్ మొత్తం కలిసి అఖండ 2పై నెగిటివ్ ట్రోలింగ్ చేయడానికి రెడీగా ఉంది" అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కానీ నందమూరి అభిమానుల మాట ఒక్కటే— ఎవరెన్ని ప్లాన్లు చేసినా, ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా, అఖండ 2 మాత్రం అఖండ విజయాన్ని అందుకుంటుంది. బాలయ్య–బోయపాటి కాంబో అంటేనే థియేటర్లలో జనం పండగ. ఈసారి కూడా అదే జరగబోతోందని ఫ్యాన్స్ పక్కా విశ్వాసంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: